బ్రూస్ లీ కథ ఇదే
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల తెరకెక్కించిన చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రాన్ని డి.వి.వి. ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించారు. దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా బ్రూస్ లీ చిత్రాన్ని రేపు రిలీజ్ చేయనున్నారు.అయితే బ్రూస్ లీ కథ ఇదే అంటూ ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఆ కథ ఏమిటంటే...చరణ్ కు ఓ అందమైన కుటుంబం ఉంటుంది. చరణ్ సిస్టర్ క్రుతి కర్భంధను కలెక్టర్ గా చూడాలని నాన్న కోరిక. చరణ్ ని కలెక్టర్ గా చూడాలనేది అమ్మ కోరిక. కానీ చరణ్ కి మాత్రం కలెక్టర్ అవ్వాలని ఉండదు. అయితే మంచి మార్కులు వస్తే..ఎక్కడ కలెక్టర్ చదవమంటారా అని తక్కువ మార్కులు తెచ్చుకుంటాడట.
ఆతర్వాత చరణ్ సిస్టర్ క్రుతి కర్భంధ కలెక్టర్ అవ్వడం..చరణ్ తన అభిరుచి మేరకు స్టంట్ మాస్టర్ అవ్వడం జరుగుతంది. అయితే క్రుతి కర్భంధను అరుణ్ విజయ్ కి ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే క్రుతి కర్భంధ మామ సంపత్ ప్రజలకు అనారోగ్యం కలిగించే వైరసీ వ్యాప్తి చేస్తుంటాడట. ఈ విషయాన్ని కోడలు క్రుతి కర్భంధ తెలుసుకుని మామ చేసే అక్రమాలకు అడ్డంగా నిలుస్తుందట...ఆతర్వాత మామ సంపత్ కోడలపై కక్ష సాధించడం...అక్క పై కక్ష సాధిస్తున్న వారిని తమ్ముడు చరణ్ ఎదురించడం...అంతా మామూలే. చివరికి ప‌్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునే సంపత్ కి హీరో చరణ్ ఎలా బుద్ధి చెప్పాడనేది మిగిలిన కథ అట. ఇదే బ్రూస్ లీ కథ అంటూ ప్రచారం జరుగుతుంది. మరి...ఈ కథ నిజమా..? కాదా..? అనేది మరికొన్ని గంటల్లోనే తెలుస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments