న్యూ ఫార్మెట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్రూస్ లీ
- IndiaGlitz, [Thursday,September 24 2015]
రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నారు. చాలా కాలం తర్వాత మెగాస్టార్ ఈ చిత్రంలో నటిస్తుండడంతో బ్రూస్ లీ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దసరా కానుకగా అక్టోబర్ 16న బ్రూస్ లీ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ రోజు (సెప్టెంబర్ 24) బ్రూస్ లీ డైరెక్టర్ శ్రీను వైట్ల పుట్టినరోజు. ఈ సందర్భంగా బ్రూస్ లీ గురించి డైరెక్టర్ శ్రీను వైట్ల ఇంటర్ వ్యూ మీకోసం...
బ్రూస్ లీ చిత్రంలో చిరంజీవి గారు నటిస్తున్నారు కదా..? ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
చిరంజీవి గారి పాత్ర కథకనుగుణంగానే ఉంటుంది తప్ప ఏదో కావాలని పెట్టినట్టు ఉండదు. అయితే చిరంజీవి గారి పాత్ర ఎలా ఉంటుందని చాలా మంది అడుగుతున్నారు. చాలా రోజుల తర్వాత చిరంజీవి గారు నటిస్తున్నారు. కాబట్టి చిరంజీవి గారి పాత్ర ఎలా ఉంటుందనేది సస్పెన్స్. మీరు తెలుసుకోవాలంటే అక్టోబర్ 16 వరకు వెయిట్ చేయాల్సిందే.
బ్రూస్ లీ టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటి..?
ఈ సినిమాలో చరణ్ స్టంట్ మేన్ గా నటిస్తున్నారు. ఆయన బ్రూస్ లీ కి పెద్ద ఫ్యాన్. అందుకనే చేతిపై బ్రూస్ లీ అని టటూ కూడా వేయించుకుంటాడు. ఇక బ్రూస్ లీ క్యాప్షన్ విషయానికి వస్తే...ది ఫైటర్ అని పెట్టాం. బ్రూస్ లీ అంటే ఫైటర్ అని తెలుస్తుంది. అయినప్పటికీ ది ఫైటర్ అని ఎందుకు పెట్టామంటే...ఒక ఆర్డినరీ మేన్ కి ఎక్స్ ట్రార్డినరీ ప్రొబ్లమ్ ఎదురైనప్పుడు ఎలా ఫైట్ చేసి దాని నుంచి బయటపడ్డాడు అనేది ఈ సినిమాలో చూపించాం. అందుకనే ది ఫైటర్ అని క్యాప్షన్ పెట్టాం.
ఇంతకీ...బ్రూస్ లీ ఏ తరహా చిత్రం..?
బ్రూస్ లీ అనేది ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇందులో యాక్షన్, ఎంటర్ టైన్మెంట్, రొమాన్స్...ఇలా ప్రేక్షకుల కోరుకునే అన్ని అంశాలు ఉంటాయి.
మీ సినిమాలు అన్నీ ఒకే ఫార్మెట్ లో ఉంటున్నాయి. బ్రూస్ లీ కూడా మీ రెగ్యులర్ ఫార్మెట్ లోనే ఉంటుందా..?
ఈమధ్య నేను తీసిన సినిమాలు ఇంచుమించు ఒకే ఫార్మెట్ లో ఉన్నాయి. ఆ తర్వాత అదే ఫార్మెట్ లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే నా నుంచి ఎంటర్ టైన్మెంట్ ఎక్స్ పెక్ట్ చేస్తారు కాబట్టి బ్రూస్ లీ సినిమాలో కూడా ఎంటర్ టైన్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే బ్రూస్ లీ చిత్రం రెగ్యులర్ ఫార్మెట్ లో కాకుండా ఓ కొత్త ఫార్మెట్ లో ఉంటుంది.
చిరంజీవి గారిపై చిత్రీకరించే సీన్స్ ఎప్పుడు షూట్ చేస్తున్నారు..?
ఈ నెల 26 నుంచి చిరంజీవి గారి పై సీన్స్ షూట్ చేస్తాం. చిరంజీవి గారి సీన్స్, టు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్.
చిరు, చరణ్ ఇద్దరినీ కలపి ఒకే మూవీలో డైరెక్ట్ చేయడం ఎలా ఫీలవుతున్నారు..?
చిరంజీవిగారితో అందరివాడు సినిమా చేసాను. చరణ్ తో బ్రూస్ లీ చేస్తున్నాను. అయితే ఇద్దరినీ కలపి ఒకే మూవీలో డైరెక్ట్ చేసే అవకాశం రావడం నిజంగా అద్రుష్టంగా భావిస్తున్నాను. అందుకనే నాకు బ్రూస్ లీ స్పెషల్ మూవీ.
మీ సినిమా అంటే కామెడీ బాగా ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఇందులో కామెడీ ఎలా ఉంటుంది..?
ఈ సినిమాలో బ్రహ్మానందం గారి పాత్ర మంచి ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. అలాగే జయప్రకాష్ రెడ్డి గారి పాత్ర కూడా చాలా హైలైట్ గా ఉంటుంది. ఈ వయసులో కూడా ఆయన చాలా కష్టపడి చేసారు. ఖచ్చితంగా ఆడియోన్స్ ఎంజాయ్ చేస్తారు.
ఫ్యాన్స్ కి బ్రూస్ లీ మూవీ ఎలా ఉంటుంది..?
చిరంజీవి గారు, చరణ్ కలసి నటించడంతో ఈ మూవీపై ఫ్యాన్స్ చాలా నమ్మకంతో ఉన్నారు. వారి నమ్మకానికి ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రూస్ లీ రిలీజ్ అయితే ఫ్యాన్స్ కి పండగే.