టీఆర్ఎస్గా మారనున్న బీఆర్ఎస్.. మాజీ మంత్రి కీలక ప్రకటన..
Send us your feedback to audioarticles@vaarta.com
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షోభం ఎదుర్కొంటోంది. ఓవైపు అధికారం కోల్పోవడం.. మరోవైపు నేతల వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి డీలా పడిన పార్టీ అధినేత కేసీఆర్కు లోక్సభ ఎన్నికలు విషమ పరీక్షను తీసుకొచ్చాయి. కనీసం ఎంపీలుగా పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకలేదు. కొన్ని చోట్ల సీట్లు ఇచ్చినా మాకొద్దు అంటూ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో వెళ్లిపోయారు. దీంతో పార్టీలో ఎవరూ ఎప్పుడూ రాజీనామా చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.
మరోవైపు మంత్రులు కూడా 12 నుంచి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం కానుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీని మార్చేందుకు కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2001లో ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ను కేసీఆర్ ప్రారంభించారు. ప్రత్యేక రాష్ట్రమే ధ్యేయంగా దశాబ్దం పాటు కొట్లాడారు. ఈ సమయంలో టీఆర్ఎస్ పార్టీని తమ ప్రాంత పార్టీగా ప్రజలు భావించారు. ఈ క్రమంలోనే 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవివర్భవించింది. అప్పటి నుంచి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించారు.
దాదాపు పదేళ్లు పాటు ఏకచత్రాధిపత్యంతో తెలంగాణను కేసీఆర్ పాలించారు. అయితే 2022లో జాతీయ రాజకీయాలను తీర్చిద్దాలని భావించి పార్టీ పేరును మార్చారు. తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చారు. దీంతో కేసీఆర్కు కష్టాలు మొదలయ్యాయి. పార్టీలో తెలంగాణ పేరును తీయడాన్ని ప్రజలు హర్షించలేదు. దీంతో ఆ పార్టీకి తెలంగాణతో రుణం తెగిపోయిందనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పేరుతోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడంతో ప్రజలు ఆ పార్టీని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారు.
అయితే అప్పటి నుంచి పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చాలని పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కేసీఆర్ కూడా పార్టీ పేరును మార్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక ప్రకటన చేశారు. వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో చేపట్టిన దీక్షలో ఎర్రబెల్లి లాడుతూ.. బీఆర్ఎస్ పేరు మార్చే ఆలోచన చేస్తున్నామని.. మళ్లీ టీఆర్ఎస్ పార్టీగా మార్చేందుకు కసరత్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పార్టీ పేరు మార్పుపై ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమైందని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పేరుతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ పేరు మార్చగానే అధికారం కోల్పోయిందని వెల్లడించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ పేరు టీఆర్ఎస్గా మారడం ఖాయమనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com