Kavitha Arrest: బిగ్ బ్రేకింగ్: లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి మధ్యాహ్నం నుంచి కవిత ఇంట్లో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నాలుగు గంటల పాటు సోదాల అనంతరం ఆమె ఫోన్లు సీజ్ చేసి అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే తనను ఏ ప్రాతిపదికన అరెస్టు చేస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. కాసేపట్లో ఆమెను విమానంలో ఢిల్లీకి తరించనున్నారు. అధికారులు సోదాలకు వచ్చేటప్పుడు కవితతో పాటు వారికి కూడా విమానం టికెట్లు బుక్ చేసుకుని వచ్చారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసేందుకు ముందుగా ప్లాన్ ప్రకారమే వచ్చారని అర్థమవుతోంది.
మరోవైపు కవిత ఇంటి వద్దకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చేరుకుని అధికారులతో మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్లో ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా కవిత ఇంటి దగర్గకి చేరుకుని ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఈ అరెస్టుపై న్యాయపోరాటం చేస్తామని నేతలు చెబుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పాడటంతో పోలీసులు భారీగా మోహరించారు. కవిత ఇంట్లోకి ఎవరిని అనుమతించడం లేదు.
కాగా లిక్కర్ కేసులో ఆమెను ఇటీవల సీబీఐ నిందితురాలిగా చేర్చిన సంగతి తెలిసిందే. పలుమార్లు విచారణకు హాజరుకావాలని సీబీఐతో పాటు ఈడీ అధికారులు కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఈడీ సమన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ నెల 19న విచారణ జరపనున్నట్లు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది.
గతేడాది మార్చిలో కవితను మూడు సార్లు ఢిల్లీలో ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. విచారణకు సహకరించిన కవిత.. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో ఆమె వినియోగించిన ఫోన్లు, ల్యాప్టాప్లు సైతం వారికి అప్పగించారు. అప్పుడు రోజుకు దాదాపు 10 గంటలకు పైగా కవితను విచారించారు. అంతసేపు విచారించడంతో ఆమె అరెస్ట్ ఖాయమని జోరుగా ప్రచారం జరిగింది. అయితే అప్పటినుంచి ఆమె విచారణ పెండింగ్లోనే ఉంది. ఇప్పుడు ఏకంగా ఆమెను ఇంట్లోనే అరెస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments