Kalvkuntla Kavitha:ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఈడీ ఎదుట విచారణకు హాజరైన కల్వకుంట్ల కవిత, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

  • IndiaGlitz, [Monday,March 20 2023]

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణ హాజరయ్యారు. తొలుత ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్దకు కవిత భర్త అనిల్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, లాయర్ సోమ భరత్ చేరుకున్నారు. అనంతరం కవిత కార్యాలయంలోకి వెళ్లారు. దీంతో తెలంగాణ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కవితను అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

మార్చి 11న విచారణకు హాజరైన కవిత :

కాగా.. ఈ కేసుకు సంబంధించి మార్చి 11న కవిత ఈడీ ఎదుట హాజరయ్యారు. ఆరోజున దాదాపు 9 గంటల పాటు కవితను విచారించింది ఈడీ. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను రాబట్టంతో పాటు ఆమె వ్యక్తిగత సెల్‌ఫోన్స్‌ను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మార్చి 16న మరోసారి తమ ఎదుట హాజరవ్వాల్సిందిగా ఈడీ నోటీసులు ఇచ్చింది. దీంతో అదే రోజు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులతో కలిసి కవిత హైదరాబాద్‌కు చేరుకుని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహిళనైన తనను కార్యాలయానికి పిలిపించడం, రాత్రి 9 గంటల వరకు కూర్చోబెట్టడంతో పాటు బెదిరింపులు, బలప్రయోగం, థర్డ్ డిగ్రీ విధానాలను ఈడీ అవలంభిస్తోందని దీనిని అడ్డుకునేలా ఆదేశాలివ్వాలని కవిత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై మార్చి 24న సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరపనుంది.

సుప్రీంకోర్టులో ఈడీ కేవియెట్ :

మార్చి 16న విచారణకు హాజరవుతానని చెప్పి ఈడీకి షాకిచ్చారు కవిత. తన ప్రతినిధి మాత్రం ఈడీ ఆఫీస్‌కు పంపి, సుప్రీంకోర్టులో కేసు విచారణలో వున్నందున తాను హాజరుకాలేనని ఈడీకి లేఖ రాశారు కవిత. దీనిపై స్పందించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఈ నెల 20 తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో ఈడీ సైతం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తమ వాదనలు వినకుండా కవిత విషయంలో ఎలాంటి ముందస్తు ఆదేశాలు జారీ చేయొద్దని సుప్రీంకోర్టును కోరుతూ కేవియెట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

More News

Ram Gopal Varma:‘ఓ తాతగారూ మీరింకా ఉన్నారా?’ .. వీహెచ్‌పై సెటైర్లు వేసిన రామ్‌గోపాల్ వర్మ, ట్వీట్ వైరల్

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ జోలికి ఎవరైనా వెళ్లడానికి భయపడతారు. వెళితే.. తమను తిరిగి ఏమంటారోనని వారికి భయం.

ఈ తోడేళ్లంతా ఎందుకు ఏకమవుతున్నాయి.. విపక్ష నేతలను ఉద్ధేశించి జగన్ వ్యాఖ్యలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ ప్రాంతాల్లో

Taraka Ratna:పెళ్లి తర్వాతే కష్టాలు.. అంతటా వివక్షే, నీ గుండెల్లో అంతులేని బాధ : తారకరత్న సతీమణి ఎమోషనల్ పోస్ట్

సినీనటుడు నందమూరి తారకరత్న అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమను శోక సంద్రంలో ముంచెత్తింది.

'KCPD' (కొంచెం చూసి ప్రేమించు డ్యూడ్) చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

రామిడి శ్రీరామ్, తనీష్ అల్లాడి,ద్వారక విడియన్ (బంటి) ప్రియాంక నిర్వాణ,దివ్య డిచోల్కర్ నటీ నటులుగా కార్తీక్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "KCPD"

Ram Charan:హైదరాబాద్‌లో చరణ్‌కు ఘనస్వాగతం .. అభిమానులతో కిక్కిరిసిన బేగంపేట్ , అర్ధరాత్రి కూడా క్రౌడ్ తగ్గలేదుగా

ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ లభించిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కు చేరుకున్న మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు అభిమానులు ఘనస్వాగతం