MLC Kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాలుకు ఫ్రాక్చర్.. మూడు వారాల పాటు రెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గాయపడ్డారు. తన కాలుకు ఫ్రాక్చర్ అయినట్లుగా కవిత స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని.. నేరుగా కలవలేనివారు సోషల్ మీడియా ద్వారా తనను సంప్రదించవచ్చని కవిత పేర్కొన్నారు. అయితే తాను ఎలా గాయపడ్డానన్న విషయాన్ని మాత్రం కవిత వెల్లడించలేదు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఎదుట హాజరైన కవిత:
ఇదిలావుండగా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో ఆమె మూడు సార్లు విచారణకు కూడా హాజరయ్యారు. తొలుత మార్చి 11న ఆ తర్వాత మార్చి 16న అనంతరం మార్చి 20న కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరై పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ సమయంలో ధ్వంసమైనట్లుగా ఈడీ ఆరోపించిన తన ఫోన్‌లను మీడియాకు చూపించి సంచలనం సృష్టించారు.
కాలి నొప్పితో బాధపడుతున్న జగన్ :
ఇకపోతే.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు కూడా కొద్దిరోజుల క్రితం కాలికి గాయమైన సంగతి తెలిసిందే. ఉదయం పూట వ్యాయామం చేస్తుండగా సీఎం కాలు బెణికింది. డాక్టర్ల సూచన మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అంతేకాదు సీఎం హోదాలో ఒంటిమిట్ట ఆలయానికి వెళ్లాల్సిన పర్యటనను కూడా ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నారు. గతంలోనూ ఇలాగే గాయంతో ఇబ్బందిపడ్డ జగన్.. తర్వాత కోలుకున్నారు. అయితే మరోసారి ఆయనకు గాయం తిరగబెట్టింది.
Due to Avulsion fracture, I have been advised bed rest for 3 weeks.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 11, 2023
My @OfficeOfKavitha shall be available for any assistance or communication.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com