Kalvakuntla Kavitha:కవితక్కకు బర్త్ డే విషెస్ : అభిమానం చాటుకున్న బీఆర్ఎస్ నేత.. ఏకంగా సముద్రం అడుగుకి వెళ్లి
Send us your feedback to audioarticles@vaarta.com
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్మమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, అభిమానులు కవితకు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు. ఈమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వుండాలని వారు ఆకాంక్షిస్తున్నారు. పలు చోట్ల రక్తదానాలు, అన్నదానాలు, పేదలకు పండ్ల పంపిణీ చేస్తున్నారు గులాబీ నేతలు. అయితే ఓ నాయకుడు మాత్రం విభిన్నంగా కవితకు శుభాకాంక్షలు తెలిపి తన అభిమానాన్ని చాటుకున్నారు.
అండమాన్ దీవులకు వెళ్లిన బీఆర్ఎస్ నేత చిన్ను గౌడ్:
నిజామాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ నేత చిన్నుగౌడ్ సముద్రపు అడుగు భాగంలోకి వెళ్లి కవితకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని రాసి వున్న బ్యానర్లు ప్రదర్శించారు. అండమాన్ నికోబార్ దీవుల్లో బంగాళాఖాతం అడుగు భాగానికి వెళ్లిన చిన్నుగౌడ్.. ‘‘హ్యాపీ బర్త్ డే కవిత అక్క’’ అని రాసి వున్న బ్యానర్లను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోలను టీఎస్ ఫుడ్స్ ఛైర్మన్ రాజీవ్ సాగర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు, అభిమానులు వీటిని షేర్ చేస్తున్నారు.
ఈ నెల 16న మరోసారి ఈడీ ఎదుటకు కవిత:
ఇదిలావుండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా కల్వకుంట్ల కవిత ఈ నెల 11న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. దాదాపు 9 గంటల పాటు ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించి పలు కీలక వివరాలను రాబట్టారు. ఈ కేసుకు సంబంధించి కవితను ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసు ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com