RS Praveen Kumar: తెలంగాణ గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడు పెత్తనం ఏంది బై: ఆర్‌ఎస్పీ

  • IndiaGlitz, [Tuesday,May 28 2024]

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న రాష్ట్ర గీతం 'జయజయహే తెలంగాణ' చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని ఈ గీతానికి సంగీతం అందించాలని ప్రభుత్వం కోరడంపై బీఆర్‌ఎస్ ‌నేతలు తప్పుబడుతున్నారు. తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ రేవంత్ సర్కారుపై విరుచుకుపడ్డారు. కీరవాణి సంగీతం సమకూర్చడానికి ఇది నాటు నాటు పాట కాదని... తెలంగాణ రణ నినాదమని గర్జించారు.

అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతంపై 'ఆంధ్రా' సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి పెత్తనం ఏంది భై ? గీత స్వరకల్పనకు మళ్లీ ఇప్పుడేం అవసరమొచ్చింది? అయినా తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంత కాలం? అదీ తెలంగాణ వచ్చి పదేళ్లయినంక? అంటూ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డీ... కీరవాణి స్వరకల్పన చేయడానికి ఇదీ నాటు నాటు పాట కాదు. నాటి ఆంధ్ర పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన వందల మంది అమరుల త్యాగాలు, 4 కోట్ల ప్రజల కలల ప్రతి రూపం. ఒక రణ నినాదం. ధిక్కార స్వరం. అందెశ్రీ ఇచ్చిన ఒరిజినల్ ట్యూన్‌తోనే ఈ గీతాన్ని యావత్తు తెలంగాణ ఆనాడు ఆలాపించింది. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 3, 2011 విద్యార్థి గర్జనలో లక్షల మంది ప్రజలు ఈ గీతాన్ని సామూహికంగా ఆలాపించిన తీరు చూసుంటే మీరు ఈ దుస్సాహసం చేయరు. మీరప్పుడు అక్కడ ఉండే అవకాశం లేదు కాబట్టి బహుశా మీకిది తెల్వదు. నేనారోజు అక్కడ ఉన్న కాబట్టి చెబుతున్నా అని తెలిపారు.

టాలీవుడ్, తెలంగాణ ఉద్యమం వేరువేరు. టాలీవుడ్ వినోదం కోసం ఉంది. తెలంగాణ గీతం అనేది ఉద్యమ సమయంలో తెలంగాణ నినాదాన్ని ఒకచోట చేర్చిన భావోద్వేగం. జనగణమన, వందేమాతరం చిత్రాలకు ట్యూన్ ఇచ్చింది హాలీవుడ్ కాదు. పాపం అందెశ్రీ అమాయకుడు, నిస్సహాయుడు కాబట్టి మౌనంగా కూర్చున్నడు. మీరేం చేసినా భరిస్తున్నడు. మీరు ఆంధ్ర సంగీత కళాకారులకు అంత ముచ్చటపడితే దయచేసి ఏపీకి వెళ్లి అక్కడ సీఎం అవ్వండి. తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చుంటే తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించి తెలంగాణ ప్రతిభను ప్రోత్సహించాలి సార్. ప్రజాప్రతినిధులు, ఆంధ్రా ఏజెంట్ల పాలన మనకు చాలు. ఇలాంటి దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో తరాలు పోరాడి ప్రాణాలు కోల్పోయాయి. అన్నారు.

తెలంగాణ ప్రజలారా, జూన్ 2 నాడు ఆంధ్ర సంగీతకారులు స్వరకల్పన చేసిన మన తెలంగాణ గీతాన్ని పాడుకుందమా, లేక మన ఒరిజినల్ గీతాన్నే పాడుకుందమా?? అని పిలుపునిచ్చారు ప్రవీణ్‌కుమార్. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో మరోసారి అగ్గి రాజుకుంది.

More News

Rakshana: పాయల్ రాజ్‌పుత్ 'రక్షణ' జూన్ 7న గ్రాండ్ రిలీజ్

‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన పాత్ర‌ల‌కు భిన్నంగా..ప‌వ‌ర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో

Pune Car Incident: పుణే ర్యాష్ డ్రైవింగ్ కేసులో అదిరిపోయే ట్విస్టులు.. తాజా ట్విస్ట్ ఏంటంటే..?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణేలో డ్రంకన్ డ్రైవ్ కారు కేసులో రోజుకో సంచలన పరిణామం చోటుచేసుకుంటుంది. థ్రిల్లర్ మూవీలను మించిన ట్విస్టులు బయటపడుతున్నాయి.

MLC Elections: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రలోభాలు.. స్వతంత్ర అభ్యర్థిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి!

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రాడ్యుయేట్లు పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు.

Amit Shah: ఏపీలో కూటమిదే అధికారం.. ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన అమిత్ షా

ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ జూన్ 4వ తేదీ జరగనుండగా.. ఫలితాలపై రాజకీయ విశ్లేషకులు, నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

Seethakka: టీపీసీసీ చీఫ్ రేసులో సీతక్క.. సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలించేనా..?

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చొబెట్టింది. ఆయన సారథ్యంలోనే పార్లమెంట్