KCR: నేడే విడుదల : కాసేపట్లో బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్, ఆశావహుల్లో టెన్షన్.. కేసీఆర్ చల్లని చూపు ఎవరి మీదో..?

  • IndiaGlitz, [Monday,August 21 2023]

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో అన్ని పార్టీలు జోరు పెంచాయి. మూడోసారి అధికారాన్ని అందుకోవాలని బీఆర్ఎస్, ఈసారి ఎలాగైనా పవర్ దక్కించుకోవాలని కాంగ్రెస్, దక్షిణాదిలో కర్ణాటక చేజారడంతో ఆ లోటును తెలంగాణ ద్వారా భర్తీ చేసుకోవాలని బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అన్ని పార్టీల్లోనూ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. అయితే కేసీఆర్ విపక్షాలకు అందని ఎత్తులతో అందరి కంటే ముందే అభ్యర్ధులను ఎంపిక చేసే పని పూర్తి చేసి షాకిచ్చారు. ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితాను ప్రకటించనున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. తొలి నుంచి ముహూర్తాలు, జ్యోతిష్యంపై మంచి పట్టున్న కేసీఆర్.. అభ్యర్ధుల జాబితా ప్రకటన సందర్భంగా తన లక్కీ నెంబర్ 6 కలిసి వచ్చేలా 65, 87, 96, 105 మందితో లిస్ట్ ప్రకటిస్తారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

సిట్టింగ్‌ల్లో పది మందికి నో ఛాన్స్ :

సిట్టింగ్‌లకే అవకాశం కల్పిస్తానని కేసీఆర్ తొలి నుంచే చెబుతున్నారు. అయితే సర్వేల ఆధారంగా వీరిలో కొందరిని తప్పించి వారి ప్లేస్‌లో కొత్త వారిని ఎంపిక చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడున్న సిట్టింగ్‌ల్లో పది నుంచి పదిహేను మందికి టికెట్ దక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది. మరోవైపు.. సోమవారం అభ్యర్ధుల జాబితా వుంటుందని తెలియడంతో ఆశావహులంతా కేటీఆర్, కవిత, హరీశ్ రావు వంటి అగ్రనేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రెండు మూడు రోజుల నుంచి వీరు నివాసాలు వచ్చి పోయే నాయకులతో కిటకిటలాడుతున్నాయి. కానీ కేసీఆర్ ఒక్కసారి కమిట్ అయితే ఎవ్వరి మాట వినరని తెలిసినా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌లపై కేసీఆర్ విమర్శలు :

మరోవైపు.. నిన్న సూర్యాపేట నుంచే తెలంగాణ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీలపై వాడి వేడి విమర్శలతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ పైరవీకారుల రాజ్యం వస్తుందని.. మోసపోతే , గోస పడతామని ఆయన ప్రజలను హెచ్చరించారు. ధరణి తీసేస్తారని, రైతు బంధు ఎత్తేస్తారని ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు. కాంగ్రెస్, బీజేపీలు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నాయని.. 50 ఏళ్లుగా ఇస్తూనే వున్నారని వాళ్లు ఏం చేశారని సీఎం ప్రశ్నించారు.

More News

Ramanna Youth: 'రామన్న యూత్' రిలీజ్ డేట్ లాక్.. డా.జయప్రకాశ్ నారాయణ చేతుల మీదుగా పోస్టర్ విడుదల

ఓ బేబీ సక్సెస్‌తో టాలీవుడ్‌లో చిన్న సినిమాలు జోరు చూపిస్తున్నాయి. కథ, కథనం బాగుంటే స్టార్ క్యాస్టింగ్‌తో పని లేకుండా జనం ఆదరిస్తారని తేలింది.

ఎన్నిక ఏదైనా రిజల్ట్ ఒకటే: ‘‘పంచాయతీ’’లో వైసీపీ జయభేరి, టీడీపీకి షాక్.. చంద్రబాబు ఇలాఖాలోనూ పరాభవం

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఉప ఎన్నిక జరిగినా.. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పురపాలక, నగరపాలక ఎన్నికలు .. ఇలా ఏది చూసుకున్న జగన్ పార్టీ ప్రభంజనం సృష్టించింది.

అడుగు దూరంలో ఢమాల్.. చంద్రునిపై కుప్పకూలిన రష్యా ల్యాండర్, రేసులో చంద్రయాన్ 3

దాదాపు 47 ఏళ్ల తర్వాత.. అది కూడా భారత్ చంద్రయాన్ 3 ప్రయోగించిన సమయంలోనే రష్యా నింగిలోకి పంపిన లూనా 25 ల్యాండర్ మిషన్ విఫలమైంది. చంద్రుడిపై దిగే క్రమంలో ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్

పాడేరు ఘాట్‌లో ఘోర ప్రమాదం : 100 అడుగుల లోయలో పడ్డ ఆర్డీసీ బస్సు, అందులో 50 మంది ప్రయాణీకులు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు 100 అడుగుల లోయలో పడిన ఘటనలో ఇద్దరు మరణించగా.. 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

సంప‌త్ నంది చేతుల మీదుగా `సౌండ్ పార్టీ`టీజ‌ర్ లాంచ్‌.. మరో జాతిరత్నాలంటూ ప్రశంసలు

బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ హీరో హీరోయిన్లుగా పుల్‌మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మిస్తోన్న చిత్రం ‘‘సౌండ్ పార్టీ’’.