KCR: నేడే విడుదల : కాసేపట్లో బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్, ఆశావహుల్లో టెన్షన్.. కేసీఆర్ చల్లని చూపు ఎవరి మీదో..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో అన్ని పార్టీలు జోరు పెంచాయి. మూడోసారి అధికారాన్ని అందుకోవాలని బీఆర్ఎస్, ఈసారి ఎలాగైనా పవర్ దక్కించుకోవాలని కాంగ్రెస్, దక్షిణాదిలో కర్ణాటక చేజారడంతో ఆ లోటును తెలంగాణ ద్వారా భర్తీ చేసుకోవాలని బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అన్ని పార్టీల్లోనూ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. అయితే కేసీఆర్ విపక్షాలకు అందని ఎత్తులతో అందరి కంటే ముందే అభ్యర్ధులను ఎంపిక చేసే పని పూర్తి చేసి షాకిచ్చారు. ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితాను ప్రకటించనున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. తొలి నుంచి ముహూర్తాలు, జ్యోతిష్యంపై మంచి పట్టున్న కేసీఆర్.. అభ్యర్ధుల జాబితా ప్రకటన సందర్భంగా తన లక్కీ నెంబర్ 6 కలిసి వచ్చేలా 65, 87, 96, 105 మందితో లిస్ట్ ప్రకటిస్తారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
సిట్టింగ్‌ల్లో పది మందికి నో ఛాన్స్ :
సిట్టింగ్‌లకే అవకాశం కల్పిస్తానని కేసీఆర్ తొలి నుంచే చెబుతున్నారు. అయితే సర్వేల ఆధారంగా వీరిలో కొందరిని తప్పించి వారి ప్లేస్‌లో కొత్త వారిని ఎంపిక చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడున్న సిట్టింగ్‌ల్లో పది నుంచి పదిహేను మందికి టికెట్ దక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది. మరోవైపు.. సోమవారం అభ్యర్ధుల జాబితా వుంటుందని తెలియడంతో ఆశావహులంతా కేటీఆర్, కవిత, హరీశ్ రావు వంటి అగ్రనేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రెండు మూడు రోజుల నుంచి వీరు నివాసాలు వచ్చి పోయే నాయకులతో కిటకిటలాడుతున్నాయి. కానీ కేసీఆర్ ఒక్కసారి కమిట్ అయితే ఎవ్వరి మాట వినరని తెలిసినా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
బీజేపీ, కాంగ్రెస్‌లపై కేసీఆర్ విమర్శలు :
మరోవైపు.. నిన్న సూర్యాపేట నుంచే తెలంగాణ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీలపై వాడి వేడి విమర్శలతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ పైరవీకారుల రాజ్యం వస్తుందని.. మోసపోతే , గోస పడతామని ఆయన ప్రజలను హెచ్చరించారు. ధరణి తీసేస్తారని, రైతు బంధు ఎత్తేస్తారని ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు. కాంగ్రెస్, బీజేపీలు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నాయని.. 50 ఏళ్లుగా ఇస్తూనే వున్నారని వాళ్లు ఏం చేశారని సీఎం ప్రశ్నించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com