BRS: మరో రెండు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్
Send us your feedback to audioarticles@vaarta.com
పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తాజాగా చేవెళ్ల, వరంగల్ ఎంపీ స్థానాలను అభ్యర్థులను వెల్లడించారు. చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ నుంచి మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు అవకాశం ఇచ్చారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్.. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సీనియర్ నేత కావడంతో ఆయనకు చేవెళ్ల లోక్ సభ స్థానం టికెట్ దక్కింది.
లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై కసరత్తు చేస్తున్న కేసీఆర్.. బుధవారం వరంగల్ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సహా ముఖ్య నేతలందరూ హాజరయ్యారు. అనంతరం అభ్యర్థిని ఎంపిక చేశారు.
కాగా వరంగల్ అభ్యర్థి ప్రకటన ముందు పెద్ద హైడ్రామా నెలకొంది. వరంగల్ ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్న ఆరూరి రమేష్ పార్టీకి రాజీనామా చేసేందుకు హన్మకొండలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి హరీష్‌రావు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఇతర నేతలు ప్రెస్‌మీట్ అడ్డుకున్నారు. అనంతరం రమేష్‌ను తీసుకుని కారులో హైదరబాద్ బయలుదేరి వెళ్లారు. తర్వాత తెలంగాణభవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయి బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని ఆరూరి స్పష్టంచేశారు.
మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ, బీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావుకు మరో అవకాశం ఇచ్చింది. మహబూబాబాద్ (ఎస్టీ) స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత పేరును ఖరారు చేయగా.. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి (ఎస్సీ రిజర్వ్) స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లను ప్రకటించారు. దీంతో మొత్తం ఆరుగురు అభ్యర్థులు ఖారారు అయ్యార. మిగిలిన 11 స్థానాల్లో రెండు స్థానాలను పొత్తులో భాగంగా బీఎస్పీకి కేటాయించనున్నారు. మిగిలిన 9 సీట్లకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout