బ్రదర్స్ సందడి ఒకే నెలలో..
- IndiaGlitz, [Monday,May 20 2019]
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల్లో విష్ణు, మనోజ్ ఉండగా మరో వైపు సాయిధరమ్ తోడుగా అతని తమ్ముడు వైష్ణవ్‌తేజ్ కూడా చేరబోతున్నాడు.
కాగా యూత్ ఐకాన్‌గా మారిన విజయ్ దేవరకొండ రూట్‌లోనే అతని సోదరుడు ఆనంద్ దేవరకొండ సినీ రంగ ప్రవేశం చేశాడు. వీరిలో ముఖ్యంగా విజయ్‌దేరకొండ, ఆనంద్ దేవరకొండ వారి సినిమాలతో ఒకేసారి థియేటర్స్‌లో సందడి చేయబోతున్నారు.
విజయ్‌దేవరకొండ, రష్మిక మందన్నా నటించిన 'డియర్ కామ్రేడ్' జూలై 26న విడుదలవుతుంది. మరో పక్కన ఈయన సోదురుడు ఆనంద్‌దేవరకొండ తొలి చిత్రం 'దొరసాని' కూడా జూలై మొదటి వారంలోనే విడుదలవుతుదని అంటున్నారు. మరి ఒకే నెలలో ఈ అన్మదమ్ములు ఎలా సందడి చేయబోతారో చూడాలి.