అన్నను ఫాలో అవుతున్న తమ్ముడు
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళంతో పాటు తెలుగులో మార్కెట్ ఉన్న కోలీవుడ్ స్టార్స్‌లో కార్తీ ఒకడు. ఇప్పుడు డ్రీమ్ వారియర్ పిక్చర్స్, పివిపి సినిమా బ్యానర్స్‌పై గోకుల్ దర్శకత్వంలో రూపొందుతోన్న కాష్మోరా చిత్రంలో నటిస్తున్నాడు. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో కార్తీ గెటప్ అందరినీ షాక్‌కు గురిచేసింది. కాగా ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రంలో కార్తీ మూడు రోల్స్ చేస్తున్నాడుట. అందులో ఒకటి రాజుగా, గుండుతో ఉన్న రోల్ లతో పాటు యంగ్ రోల్లో ప్రేక్షకులకు కనువిందు చేస్తాడట. నయనతార రాజకుమారి పాత్రలో కనపడితే, శ్రీదివ్య జర్నలిస్ట్ పాత్రలో దర్శనమిస్తుందట.
రీసెంట్గా అన్న సూర్య 24 సినిమాలో మూడు రోల్స్ చేసిన సంగతి తెలసిందే. అన్ననే ఫాలో అవుతూ కార్తీ ఇప్పుడు మూడు రోల్స్ చేస్తుండటం విశేషం. ఈ రోల్స్ డిఫరెంట్‌గా ఉండాలని ఏడు నెలలు కష్టపడి 47 గెటప్స్ ను ట్రై చేసి చివరకు మూడు గెటప్స్‌ను ఎంచుకున్నారట. 3డి ఫేస్ టెక్నాలజీని ఉపయోగిస్తున్న తొలి సౌతిండియన్ సినిమా కూడా ఇదే కావడం విశేషం అని అంటున్నారు. సినిమా కోసం చెన్నైలో భారీ సెట్స్‌ను నిర్మించారట. 80 వి.ఎఫ్.ఎక్స్ సన్నివేశాలను సినిమాను టెక్నికల్ వండర్లా తీర్చిదిద్దుతున్నారట. ఓమిని డైరెక్షనల్ కెమెరాను ఈ చిత్రంలో ఉపయోగిస్తున్నారని అంటున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా తెలుగు, తమిళంలో అక్టోబర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com