కండకావురం: జాతీయ జెండాను కాల్చిన సర్పంచ్ తమ్ముడు!
Send us your feedback to audioarticles@vaarta.com
అవును మీరు వింటున్నది నిజమే కండ్లకు కొవ్వు అడ్డపడ్డటంతో ఓ సర్పంచ్ తమ్ముడు జాతీయ జెండాను తగులబెట్టాడు. అయితే ఆయన చేసిన ఈ పనితో తీవ్ర ఆగ్రహానికి లోనైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తిరుమలపురంలో చోటుచేసుకోవడం గమనార్హం. అసలు ఆయన చదువుకున్న అజ్ఞానో.. చదువురానోడో అర్థం చేసుకోండి!.
అసలేం జరిగింది!?
రిపబ్లిక్ డే సందర్భంగా ఇవాళ దేశ వ్యాప్తంగా యావత్ భారత్ ఘనంగా వేడుకలు జరుపుకుంది. అయితే ఇదిగో మహబూబాబాద్‌లో మాత్రం విచక్షణ కోల్పోయిన సర్పంచ్ సోదరుడు మాత్రం జాతీయజెండాను తీవ్రంగా అవమానించాడు. తిరుమలపురం గ్రామ పంచాయతీలోని కార్యాలయంలో పంచాయితీ కార్యదర్శి జాతీయ జెండాను ఎగరవేసి పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్‌ను పిలవలేదు. దీంతో సర్పంచ్‌నే పిలవరా..? ఆయన లేకుండా వేడుకలు ఎలా జరుపుకుంటారు..? అంటూ తీవ్ర ఆగ్రహంతో సర్పంచ్ సోదరుడు నానా హంగామా చేశాడు. అంతేకాదు.. విచక్షణ కోల్పోయి ఏకంగా జెండానే తగులబెట్టాడు. దీంతో స్థానికంగా సర్పంచ్, ఆయన సోదరుడు.. పంచాయతీ కార్యదర్శి మధ్య గొడవ జరిగింది.
అయితే ఆ సర్పంచ్ ఏ పార్టీకి చెందిన వాడు..? సదరు పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది..? పార్టీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది..? పోలీసులు ఎలాంటి శిక్ష విధిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments