వైఎస్ జగన్ బావ అనిల్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బావ, వైఎస్ షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌ కుమార్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల్లోకెళితే.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్‌ సమీపంలో అనిల్ ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. అయితే.. వాహనంలోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో పెనుప్రమాదం తప్పింది. దీంతో బ్రదర్ అనిల్ చిన్నపాటి గాయాలతో క్షేమంగానే బయటపడ్డారు. కాగా.. ప్రమాదం జరిగిన సమయంలో కారులో అనిల్‌తో పాటు గన్‌మెన్లు, డ్రైవర్‌ ఉన్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం డ్యామేజ్ అయ్యింది.

కాగా.. అంత్యత భద్రతా ప్రమాణాలు కలిగిన కారు కావడం, ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో అందులో ఉన్నవారికి పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం గురించి తెలియగానే ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి.. తన కారులో బ్రదర్ అనిల్, గన్‌మెన్లను విజయవాడలోని ఎంజే నాయుడు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం అనిల్‌ తన గన్‌మెన్లతో కలిసి పర్యటనకు వెళ్లిపోయారు. అయితే పెను ప్రమాదం తప్పడంతో అభిమానులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

More News

టాలీవుడ్‌లో మరో విషాదం.. గుండెపోటుతో కుర్ర హీరో మృతి

మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

చిరు ‘పునాదిరాళ్లు’ డైరెక్టర్ కన్నుమూత

టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. రోజుల వ్యవధిలోనే సినీ ప్రముఖులు కన్నుమూస్తుండటం గమనార్హం.

28న వస్తున్న‘స్వేచ్ఛ’

ఆడపిల్ల పుడితే చాలు అమ్మో అనుకుంటూ అమ్మేస్తున్న సమాజమిది. అలా అమ్మకానికి గురై అభాగ్యురాలైన ఓ యువతి ఎలా బతికింది?

నిర్మాత రాజ్ కందుకూరి రిలీజ్ చేసిన 'ఏమైపోయావే' మోషన్ పోస్టర్

శ్రీరామ్ క్రియేషన్స్, వీఎం  స్టూడియోస్ పతాకాలపై మురళి దర్శకత్వంలో రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి హీరోహీరోయిన్లుగా

ప్లాప్ డైరెక్ట‌ర్‌తో నితిన్‌...నిజ‌మెంత‌?

యువ క‌థానాయ‌కుడు నితిన్ ఇప్పుడు వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.