వైఎస్ జగన్ బావ అనిల్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
- IndiaGlitz, [Saturday,February 15 2020]
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బావ, వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల్లోకెళితే.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్ సమీపంలో అనిల్ ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. అయితే.. వాహనంలోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో పెనుప్రమాదం తప్పింది. దీంతో బ్రదర్ అనిల్ చిన్నపాటి గాయాలతో క్షేమంగానే బయటపడ్డారు. కాగా.. ప్రమాదం జరిగిన సమయంలో కారులో అనిల్‌తో పాటు గన్‌మెన్లు, డ్రైవర్ ఉన్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం డ్యామేజ్ అయ్యింది.
కాగా.. అంత్యత భద్రతా ప్రమాణాలు కలిగిన కారు కావడం, ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో అందులో ఉన్నవారికి పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం గురించి తెలియగానే ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి.. తన కారులో బ్రదర్ అనిల్, గన్‌మెన్లను విజయవాడలోని ఎంజే నాయుడు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం అనిల్ తన గన్‌మెన్లతో కలిసి పర్యటనకు వెళ్లిపోయారు. అయితే పెను ప్రమాదం తప్పడంతో అభిమానులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.