Download App

Brochevarevarura Review

వైవిధ్య‌మైన క‌థాచిత్రాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపే హీరోల్లో శ్రీవిష్ణు ఒక‌రు. మాస్ ఇమేజ్ కోసం కాకుండా, మంచి క‌థ‌ల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించాల‌ని తాపత్ర‌య‌ప‌డే ఈ యువ హీరో న‌టించిన కొత్త చిత్రం `బ్రోచేవారెవురురా`.  ఆడ‌పిల్ల‌లు వారి జీవితంలో ఎక్క‌డో ఓచోట కొన్ని ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌ను ఫేస్ చేసుంటారు. అలాంటి ప‌రిస్థితుల‌ను కామెడీ కోణంలో తెర‌కెక్కిన చిత్ర‌మే ఇది. మ‌రి ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా?  లేదా?  అని తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం..

క‌థ‌:

రాహుల్‌(శ్రీవిష్ణు), రాకీ(ప్రియ‌ద‌ర్శి), రాంబో(రాహుల్ రామ‌కృష్ణ‌) చిన్న‌ప్ప‌టి నుండి మంచి స్నేహితులు. వీరికి పెద్ద‌గా చ‌దువు ఎక్కదు. ఐదేళ్లుగా ఇంట‌ర్‌ను పాస్ చేయ‌డానికి నానా తంటాలూ ప‌డుతుంటారు. ఓరోఉజు వీరు చ‌దివే కాలేజ్ ప్రిన్సిపాల్ కుమార్తె మిత్ర‌(నివేదా థామ‌స్‌), అదే కాలేజ్‌లో జాయిన్ అవుతుంది. మిత్రాకి కూడా చ‌దువు ఎక్క‌దు. అయితే ఆమెకు భ‌ర‌త‌నాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. త‌ల్లి లేక‌పోవ‌డం.. తండ్రి క్ర‌మ‌శిక్ష‌ణ‌.. టీచర్ ఆమెతో మిస్ బిహేవ్ చేయ‌డం వంటి కార‌ణాల‌తో తండ్రికి దూరంగా హైద‌రాబాద్ పారిపోవాల‌నుకుంటుంది. హైద‌రాబాద్ వెళ్లి భ‌ర‌త‌నాట్యం స్టేజ్ షోస్ ఇవ్వ‌డానికి డ‌బ్బు అవ‌స‌రం కాబ‌ట్టి.. అప్ప‌టికే స్నేహితులైన ఆర్ 3 బ్యాచ్‌కి త‌న స‌మ‌స్య‌ల‌ను చెప్పుకుంటుంది. వారు స‌హాయం చేస్తాన‌ని అనడంతో.. వారితో క‌లిసి కిడ్నాప్ డ్రామా ఆడుతుంది. త‌నే కిడ్నాప్ అయిన‌ట్లు డ్రామా ఆడి తండ్రి నుండి 8 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను రాబ‌డుతుంది. ఆ డ‌బ్బుతో హైద‌రాబాద్ వెళుతుంది. అక్క‌డ ఆమెను ఎవ‌రో కిడ్నాప్ చేస్తారు.  ఈ క‌థ ఇలా ర‌న్ అవుతుండగా డైరెక్ట‌ర్ కావాల‌నుకునే విశాల్‌(స‌త్య‌దేవ్‌), స్టార్ హీరోయిన్‌ షాలిని(నివేదా పేతురాజ్‌)తో క‌లిసి మూవీ చేయ‌డానికి క‌థ చెబుతుంటాడు. ఓ రోజు అత‌ని తండ్రికి యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు విశాల్‌కి షాలిని డ‌బ్బులిస్తుంది. విశాల్‌, షాలిని క‌లిసి ఊరికి బ‌య‌లుదేరుతారు. ఆ డ‌బ్బును ఆర్ 3 బ్యాచ్ కొట్టేస్తుంది. అస‌లు ఆర్ 3 బ్యాచ్‌కి, విశాల్‌కి ఉండే సంబంధం ఏంటి?  వాళ్లు ఎందుకు డ‌బ్బులు కొట్టేశారు?  చివ‌ర‌కు క‌థ ఎలాంటి మ‌లుపులు తీసుకుంది?  అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్‌:

- పాత్ర‌ల తీరు తెన్నులు
- స్నేహితుల మ‌ధ్య కామెడీ స‌న్నివేశాలు
- గంద‌ర‌గోళం లేని క్రైమ్ స్టోరి
- ఫ‌స్టాఫ్, ఇంట‌ర్వెల్‌

మైన‌స్ పాయింట్స్‌:

- సినిమాటిక్‌గా అనిపించే క‌థ‌
- సెకండాఫ్ ఎఫెక్టివ్‌గా అనిపించ‌క‌పోవ‌డం
- వీక్ క్లైమాక్స్‌

విశ్లేష‌ణ‌:

న‌టీన‌టుల ప‌రంగా చూస్తే సింపుల్ ఉండే ముగ్గురు స్నేహితుల మ‌ధ్య .. ఓ ల‌క్ష్యం ఉండే అమ్మాయి వ‌చ్చిన‌ప్పుడు అప్ప‌టి వ‌ర‌కు సాఫీగా సాగిన వారి జీవితాలు ఎలాంటి మ‌లుపులు తీసుకున‌న్నాయ‌నేదే సినిమా. న‌లుగురు స్నేహితులు శ్రీవిష్ణు, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌, నివేదా థామ‌స్ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. సినిమా చూస్తున్నంత‌సేపు పాత్ర‌లే గుర్తుకు వ‌చ్చేలా వారు పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. ఇక ఫ‌స్టాఫ్ అంతా శ్రీవిష్ణు, రాహుల్‌, ప్రియ‌ద‌ర్శి మ‌ధ్య వ‌చ్చే కాలేజ్ స‌న్నివేశాలు కామెడీని  తెప్పిస్తాయి. కాలేజ్‌లో ఝాన్సీతో స్నేహితులు తిట్లు తినే స‌న్నివేశాలు.. స్నేహితులు పేపర్లు కొట్టేసే స‌న్నివేశాలు.. అన్నీ యూత్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేవే. అలాగే కిడ్నాప్ స‌మ‌యంలో వ‌చ్చే స‌న్నివేశాలు ర‌క్తిక‌ట్టిస్తాయి. ఇక ఇంట‌ర్వెల్ బ్యాంగ్ సింప్లీ సూప‌ర్బ్‌. ఇక సాంకేతికంగా చూస్తే వివేక్ ఆత్రేయ క‌థ ప‌రంగా ఎలాంటి కొత్త‌ద‌నం ఉన్న క‌థ‌ను అయితే త‌యారు చేసుకోలేదు. కిడ్నాప్ డ్రామా. దానికి స‌న్నివేశాల‌ను కామెడీతో మిక్స్ చేసి రాసుకోవ‌డ‌మే బ‌లంగా మారింది. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ కామెడీ, ఇంట‌ర్వెల్ సీన్స్ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాయి. అయితే సెకండాఫ్ సాదాసీదాగానే ర‌న్ అవుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ వీక్‌గా అనిపిస్తుంది. ఇలాంటి కిడ్నాప్ డ్రామాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు చాలానే చూశారు. క‌థ‌లో కొత్త‌ద‌నం ఫీల్ కారు ప్రేక్ష‌కులు. వివేక్ ఆత్రేయ క‌థ కంటే స‌న్నివేశాల‌ను మ‌లిచిన తీరు బావుంది. పాట‌లు క‌థ‌లో భాగంగానే ఉన్నాయి. సాయిశ్రీరాం సినిమాటోగ్ర‌ఫీ బావుంది. స‌న్నివేశాలు కొన్ని సంద‌ర్భాల్లో నాట‌కీయంగా అనిపిస్తాయి.

చివ‌ర‌గా.. బ్రోచెవ‌రెవురురా.. కొత్త‌ద‌నం లేని కిడ్నాప్ డ్రామా

Read Brochevarevarura Movie Review in English

Rating : 2.8 / 5.0