జూన్ 28న విడుదలవుతున్న శ్రీవిష్ణు, నివేథా థామస్ 'బ్రోచేవారెవరురా'
- IndiaGlitz, [Tuesday,June 11 2019]
శ్రీవిష్ణు, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బ్రోచేవారెవరురా'. ఈ చిత్రం జూన్ 28న విడుదల కానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన చిత్రమిది. శ్రీవిష్ణు, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రం 'బ్రోచేవారెవరురా' కావడం గమనార్హం.
'చలనమే చిత్రము... చిత్రమే చలనము' అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. ఇటీవల విడుదలైన టీజర్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. క్రియేటివ్ నెరేషన్‌ను, ఆర్టిస్టిక్ అంశాలకు జనాలు ఫిదా అవుతున్నారు. సత్యదేవ్, నివేతా పెతురాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ సపోర్టింగ్ రోల్స్ చేశారు. వివేక్ సాగర్ స్వరాలందించారు.
ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మన్యం ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ కుమార్ మన్యం నిర్మిస్తున్నారు.'బ్రోచేవారెవరురా' ట్రైలర్, ఆడియో విడుదల గురించి త్వరలోనే నిర్మాత ప్రకటించనున్నారు.