రకుల్‌కు క్షమాపణలు చెప్పాల్సిందే
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ హీరోయిన్‌కు రకుల్ ప్రీత్‌సింగ్‌కు టీవీ ఛానెళ్లు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. వివరాల్లోకెళ్తే.. సుశాంత్ రాజ్‌పుత్ సింగ్ మరణం తర్వాత డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. నార్కోటిక్ విభాగానికి చెందిన అధికారులు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు సహా మరికొంత మందిని అరెస్ట్ చేసింది. ఆ సమయంలో నటి రకుల్ ప్రీత్ సింగ్‌కు నార్కోటిక్ విభాగం నోటీసులు జారీ చేసిందంటూ పలు టీవీ ఛానెల్స్‌లో వార్తలు ప్రసారమయ్యాయి. ఈ వార్తలపై రకుల్ చాలా సీరియస్ అయ్యింది. తనకు నార్కోటిక్ విభాగం నుండి నోటీసులు రాకపోయినా, మీడియాలో ఓ విభాగంవారు తనను టార్గెట్ చేశారంటూ ఢిల్లీ హైకోర్టులో రకుల్ ప్రీత్ సింగ్ కేసు వేసింది.
ఈ కేసులో రకుల్ ప్రీత్‌సింగ్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్డు ఆదేశాలను అనుసరించిన న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ ఆధారిటీ రకుల్‌పై నిరాధారమైన వార్తలను ప్రసారం చేసిన ఛానెల్స్‌ను నిర్దారించింది. సదరు ఛానెల్స్ రకుల్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో డిసెంబర్ 17న జీ న్యూస్, జీ హిందూస్థాన్, టైమ్స్ నౌ, ఇండియా టుడే, అజ్‌తక్ , ఇండియా టీవీ, న్యూస్ నేషన్, ఏబీపీ న్యూస్ ఛానెల్స్ రకుల్‌కు క్షమాపణలు చెబుతూ వార్తను ప్రసారం చేయనున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments