రకుల్‌కు క్షమాపణలు చెప్పాల్సిందే

  • IndiaGlitz, [Friday,December 11 2020]

టాలీవుడ్‌ హీరోయిన్‌కు రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు టీవీ ఛానెళ్లు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. వివరాల్లోకెళ్తే.. సుశాంత్‌ రాజ్‌పుత్‌ సింగ్ మరణం తర్వాత డ్రగ్స్‌ కేసు వెలుగులోకి వచ్చింది. నార్కోటిక్‌ విభాగానికి చెందిన అధికారులు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు సహా మరికొంత మందిని అరెస్ట్‌ చేసింది. ఆ సమయంలో నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు నార్కోటిక్‌ విభాగం నోటీసులు జారీ చేసిందంటూ పలు టీవీ ఛానెల్స్‌లో వార్తలు ప్రసారమయ్యాయి. ఈ వార్తలపై రకుల్‌ చాలా సీరియస్‌ అయ్యింది. తనకు నార్కోటిక్‌ విభాగం నుండి నోటీసులు రాకపోయినా, మీడియాలో ఓ విభాగంవారు తనను టార్గెట్‌ చేశారంటూ ఢిల్లీ హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కేసు  వేసింది.

ఈ కేసులో రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్డు ఆదేశాలను అనుసరించిన న్యూస్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ స్టాండర్డ్స్ ఆధారిటీ రకుల్‌పై నిరాధారమైన వార్తలను ప్రసారం చేసిన ఛానెల్స్‌ను నిర్దారించింది. సదరు ఛానెల్స్‌ రకుల్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో డిసెంబర్‌ 17న జీ న్యూస్‌, జీ హిందూస్థాన్‌, టైమ్స్‌ నౌ, ఇండియా టుడే, అజ్‌తక్‌ , ఇండియా టీవీ, న్యూస్‌ నేషన్‌, ఏబీపీ న్యూస్‌ ఛానెల్స్‌ రకుల్‌కు క్షమాపణలు చెబుతూ వార్తను ప్రసారం చేయనున్నాయి.

More News

'పుష్ప' కోసం ప్లాన్‌ మార్చిన బన్నీ అండ్‌ టీమ్‌

ఈ ఏడాది 'అల వైకుంఠపురములో' సినిమాతో నాన్‌ 'బాహుబలి' రికార్డులు క్రియేట్‌ చేసిన బన్నీ వెయిటింగ్‌ ఉండి దాదాపు ఏడాది కావస్తుంది.

'సోలో బ్రతుకే సో బెటర్‌' టైటిల్‌ ట్రాక్‌ విడుదల

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా సుబ్బ ద‌ర్శ‌క‌త్వంలో

ప్ర‌భాస్‌తో వ‌రుణ్‌తేజ్ హీరోయిన్‌..?

వ‌రుణ్‌తేజ్‌తో లోఫ‌ర్ సినిమాలో జోడీ క‌ట్టిన ముద్దుగుమ్మ దిశాప‌టాని ఇప్పుడు ప్ర‌భాస్‌తో జ‌త క‌ట్ట‌నుందా? అంటే అవున‌నే స‌మాధానం ఇండస్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

వైరల్ అవుతున్న 'దొరకునా ఇటువంటి సేవ' మూవీ పోస్టర్

ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్టర్ వైరల్ అవుతోంది. అదే 'దొరకునా ఇటువంటి సేవ'. ఈ పోస్టర్‌లో నటీనటులు ఎవరూ లేరు.

ఏలూరు ఘటనపై ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఏమన్నారంటే..

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏలూరు ఘటనపై స్థానిక ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఏవీఆర్ మోహన్ స్పందించారు.