క‌మెడియ‌న్‌తో బ్రిటీష్ మోడ‌ల్‌...

  • IndiaGlitz, [Wednesday,July 25 2018]

'శంభో శంక‌ర‌' సినిమా త‌ర్వాత క‌మెడియ‌న్ ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా న‌టిస్తున్న చిత్రం 'డ్రైవ‌ర్ రాముడు'. సీనియ‌ర్ ఎన్టీఆర్ టైటిల్‌తో ష‌క‌ల‌క శంక‌ర్ సంద‌డి చేయ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఐటెమ్ సాంగ్ పూర్త‌య్యింది. ఆస‌క్తిక‌రమైన విష‌య‌మేమంటే..

ఈ స్పెష‌ల్ సాంగ్‌లో బ్రిటీశ్ మోడ‌ల్ స్కార్లెట్ విల్స‌న్ న‌టించారు. ఇంత‌కు ముందు మోహ‌న్‌బాబు 'గాయ‌త్రి' చిత్రంలో స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించిన స్కార్లెట్ రెండో స్పెష‌ల్ సాంగ్ ఇది. ఈ సాంగ్ సినిమాకు ఎక్స్‌ట్రా ఎసెట్ అవుతుంద‌ని ద‌ర్శ‌కుడు రాజ్ స‌త్య‌, నిర్మాత‌లు K. వేణు గోపాల్ , ఎమ్ ఎల్ రాజు, టీ . కీరత్ న‌మ్మ‌కంగా ఉన్నారు.