ప్రభాస్ తో బ్రిటీష్ భామ..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం బాహుబలి2 చిత్రీకరణలో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా తర్వాత రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనపడతాడట. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బ్రిటన్ సుందరి ఎమీ జాక్సన్ ను నటింప చేయడానికి యూనిట్ ఆమెను సంప్రదించారట. తన రోల్ నచ్చడంతో ఎమీ జాక్సన్ కూడా సినిమాలో నటిండానికి అంగీకరించదని వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈ సినిమా 2017లో తెరకెక్కనుంది కాబట్టి అప్పటి లెక్కలు ఎలా మారుతాయో చూడాల్సిందే..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments