దుబాయ్, కువైట్ నుంచి వస్తూ.. ఇవి తీసుకొచ్చారో జైలుకే!
Send us your feedback to audioarticles@vaarta.com
అవును మీరు వింటున్నది నిజమే.. పొరపాటున కూడా ఇంటికొచ్చే టైమ్‌లో చిరుధాన్యాలను (కొర్రలు, అండు కొర్రలు, సామలు, ఉధలు, అరికెలు) తీసుకురావొద్దు. ఒకవేళ తీసుకొచ్చారో అంతే సంగతులు.. అరెస్ట్ తప్పదు.. అంతేకాదు జైలు శిక్ష కూడా తప్పందండోయ్. ఇదిగో ఇటీవల ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి విషయంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే.. హైదరాబాద్‌కు చెందిన సంతోష్ రెడ్డి(37) కొంతకాలంగా దుబాయ్‌లోని అబుదాబిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇండియాకు వస్తూ వస్తూ దొరికింది కదా చాన్స్ అని.. చిరు ధాన్యాలను గట్టిగానే తీసుకొచ్చాడు. అయితే ఎయిర్‌పోర్టులో ఊహించని షాక్ ఎదురవ్వడంతో అసలు విషయం తెలిసొచ్చింది.
తన లగేజీతో సహా ఎయిర్‌పోర్టులో చెకింగ్‌కు వెళ్లగా చిరుధాన్యాలను చూడగానే వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసుల అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కుయ్యో మర్రో అని మొత్తుకున్నా కనీసం ఆ పోలీసులు లెక్కచేయలేదు. అంతేకాదు జైలు శిక్ష విధించించారు అక్కడి పోలీసులు. ఇదిలా ఉంటే.. కుమారుడు ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తమ బిడ్డను ఇండియాకు రప్పించాలంటూ ఇండియన్ ఎంబసీ వారిని సంప్రదిస్తున్నారు. కాగా.. పచ్చళ్లు, పప్పు దినుసులు, మాంసాహార పదార్ధాలు, కరివేపాకు, గసగసాలు, ఎండు కొబ్బరి, కూరగాయల విత్తనాలు, డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ లేకుండా తీసుకెళ్లే మందులపై నిషేధం ఉంది. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఇండియాకు వచ్చే ముందు.. ఇలాంటివన్నీ తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments