300 మంది ముందు ముద్దుపెట్టిన వరుడు: హర్ట్ అయిన వధువు, పెళ్లి క్యాన్సిల్.. చివరిలో ట్విస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. యువతీ యువకులు యుక్త వయసుకు వచ్చిననాటి నుంచి తమ పెళ్లి గురించి ఎన్నో కలలు కంటూ వుంటారు. తమకు కాబోయే భార్య / భర్త ఎంతో అందంగా వుండాలని, ఆరడుగుల ఆజానుబాహుడు కావాలని ఆకాంక్షిస్తారు. అలాగే తమ స్తోమతకు తగ్గట్టుగా గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. బట్టలు, కళ్యాణ మండపం, నగలు, పిలుపులు, ఇన్విటేషన్ కార్డ్, పెళ్లి వంటకాలు, పెళ్లి మంటపం ఇలా ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే కొందరు అబ్బాయిలు స్టేజ్ మీద ఓవరాక్షన్ చేస్తూ వుంటారు. కొత్త పెళ్లికూతురిని ముద్దాడటం, నడుము గిల్లడం లాంటివి చేస్తూ వుంటారు. వీటిని కొందరు అమ్మాయిలు సరదాగా తీసుకుంటే ఇంకొందరు మాత్రం అస్సలు సహించరు.
ఇలాంటి వాడు నాకొద్దు:
అచ్చం అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. వందల మంది ముందు తనను ముద్దు పెట్టాడన్ని సహించని నవవధువు ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాదాయు జిల్లా బిస్లీ గ్రామానికి చెందిన అబ్బాయి.. సంభల్ జిల్లా పవాసకు చెందిన అమ్మాయికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఈ క్రమంలో గత వారం ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. వివాహ తంతు సందర్భంగా దండలు మార్చుకునే సమయంలో ఆ వెంటనే వరుడు పట్టరాని సంతోషంతో తన భార్యను ముద్దు పెట్టుకున్నాడు. అంతే వరుడి తీరుతో తీవ్ర ఆగ్రహానికి గురైన నవవధువు పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయింది. అంతేకాదు ఇలాంటి వాడు తనకు వద్దే వద్దని పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది.
కొంప ముంచిన బెట్ సరదా:
పోలీసులు పెళ్లి మండపానికి వచ్చి విచారణ జరపగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాను ఫ్రెండ్స్‌తో కలిసి ఓ పందెం వేశానని, అందుకే ఇలా చేశానని వరుడు తెలిపాడు. పెళ్లి కుమార్తెను పబ్లిక్‌గా స్టేజ్ మీదే ముద్దు పెట్టాకుంటానన్నది ఆ పందెం. దీనిని తనకు జరిగిన అవమానంగా భావించిన నవవధువు.. ఏమాత్రం ఆలోచించకుండా పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడమే కాకుండా, వరుడిపైనా కేసు పెట్టింది. ఇప్పుడే ఇలా వుంటే భవిష్యత్తులో అతను ఎలా వుంటాడోనన్న ఉద్దేశంతో పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ఆమె పేర్కొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments