మళ్లీ షూటింగ్స్‌కు బ్రేకులు
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా దెబ్బకు అన్నీ వ్యవస్థలు స్థబ్దుగా మారాయి. ఘోరంగా దెబ్బ తిన్న రంగాల్లో సినిమా, టీవీ రంగాలు వచ్చి చేరాయి. ఈ రెండింటిలో షూటింగ్స్ నిరంతరం చేస్తుండాలి. కరోనా భయంతో ఈ షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఒక లాక్డౌన్లో అంతా సర్దుకుంటుందని అనుకున్నారు. తర్వాత కూడా కంటిన్యూ కావడంతో షూటింగ్స్ దాదాపు రెండు నెలలు పాటు నిలిచిపోయాయి. షూటింగ్స్ ఆగిపోవడంతో సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌ను కలిసి షూటింగ్స్‌కు అనుమతులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వాలు కూడా విధి విధానాలతో షూటింగ్స్‌కు అనుమతులు ఇచ్చాయి. ఇంత వరకు బాగానే ఉంది.
కానీ కరోనా ప్రభావం ఇప్పుడు షూటింగ్స్‌ను తాకాయి. ముఖ్యంగా టీవీ సీరియల్స్‌లో నటించే నటుడు ప్రభాకర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అందరూ భయపడుతున్నారు. కరోనా సోకిన వ్యక్తితో పాటు షూటింగ్స్‌లో పాల్గొన్న వారందరికీ భయం పట్టుకుంది. దీంతో టీవీ రంగానికి చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు మీటింగ్ ఏర్పాటు చేసుకుని కొన్నాళ్ల పాటు షూటింగ్స్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. రెండు, మూడు రోజుల్లో మళ్లీ షూటింగ్స్ మొదలు పెట్టే విషయమై నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments