Helicopter Crashed:బ్రేకింగ్: తూప్రాన్‌లో కూలిన శిక్షణ హెలికాఫ్టర్.. ఇద్దరు మృతి

  • IndiaGlitz, [Monday,December 04 2023]

మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మున్సిపల్ పరిధి రావెల్లి శివారులో శిక్షణ హెలికాప్టర్‌ కూలింది. హైదరాబాద్‌కు చెందిన హెలికాప్టర్‌ సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కూలిపోయింది. భారీగా శబ్దం రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

కూలిన శిక్షణ హెలికాప్టర్‌లో మంటలు చెలరేగి ఒకరు లేక ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దుండిగల్‌ ఎయిర్‌పోర్టుకు చెందిన శిక్షణ విమాణం హైదరాబాద్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. హెలికాఫ్టర్ పూర్తిగా కాలిపోవడంతో ఎంతమంది మృతి చెందారనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More News

Parliament:నేటి నుంచి ఈనెల 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

నేటి నుంచి ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల 22 వరకూ కొనసాగనున్నాయి.

KCR:సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా.. రేపే కాంగ్రెస్ సీఎం ప్రమాణస్వీకారం..

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించింది. మొత్తం 65 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది.

KCR, Revanth Reddy:కామారెడ్డిలో సంచలనం.. కేసీఆర్, రేవంత్‌ రెడ్డి ఓటమి..

కామారెడ్డి నియోజకవర్గంలో సంచలనం నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం కేసీఆర్,

KTR:ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తాం: కేటీఆర్

తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

Telangana DGP:తెలంగాణ డీజీపీపై వేటు.. ఈసీ సంచలన నిర్ణయం..

తెలంగాణ ఫలితాల అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ పై సస్పెన్షన్ వేటు వేసింది.