‘‘ఆర్ఆర్ఆర్’’ లాగే ఇండియన్ ఎకానమీ కూడా రికార్డులు కొడుతుంది : కేంద్రమంత్రి పీయూష్ గోయల్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. జక్కన్న టేకింగ్.. ఎన్టీఆర్, చరణ్‌ల యాక్టింగ్‌కు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. దీంతో విడుదలైన తొలి వారంలోనే ఈ సినిమా 700 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. సమ్మర్ కావడం, ఇప్పుడిప్పుడే పరీక్షలు పూర్తవుతుండటంతో ఆర్ఆర్ఆర్ రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశం వుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్‌ను భారత ఆర్ధిక వ్యవస్థతో ముడిపెడుతూ వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.
ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశం రికార్డు స్థాయిలో 418 బిలియన్ డాలర్ల ఎగుమతులను చేసిందని తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమా లాగే మనదేశ ఆర్ధిక వ్యవస్థ కూడా రికార్డులను బద్ధలు కొట్టిందని పీయూష్ గోయల్ అన్నారు. భారతదేశంలోనే బహుశా ఆర్ఆర్ఆర్ అతిపెద్ద సినిమా అన్న ఆయన.. ఈ మూవీ రూ. 750 కోట్లకు పైగా వసూలు చేసిందని తెలుసుకున్నానని చెప్పారు. ఈ సినిమాలాగే భారత ఆర్థిక వ్యవస్థ కూడా రికార్డుల మీద రికార్డులు కొడుతుందని పీయూష్ గోయల్ ఆకాంక్షించారు. ఈ ఏడాది ఇండియా టార్గెట్‌గా పెట్టుకున్న 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల మార్క్‌ను మార్చి 23న అధిగమించామని కేంద్ర మంత్రి తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్, రత్నాలు, ఆభరణాలు, రసాయనాలు, ఫార్మాసూటికల్స్ వంటి కీలక రంగాలు ఎగుమతుల పెరుగుదలకు తోడ్పడ్డాయని పీయూష్ గోయల్ వెల్లడించారు.
దేశంలోని ఎగుమతిదారులు, రైతులు, ఎంఎస్ఎంఈలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఈ సందర్భంగా కేంద్రమంత్రి ధన్యవాదాలు తెలిపారు. దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగాయన్నారు. 2019-20 లో 2 లక్షల టన్నుల గోధుమలు ఎగుమతి అయ్యాయని పీయూష్ గోయల్ చెప్పారు. ఇదే సమయంలో 2020-21 లో 21 లక్షల టన్నులకి పైగా గోధుమలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు ఎగుమతి అయ్యాయని పేర్కొన్నారు. టీమిండియా స్పిరిట్ ను కోవిడ్ మహమ్మారి కూడా ఆపలేకపోయిందని కేంద్ర మంత్రి అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments