Pallavi Prashant:బ్రేకింగ్: రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అరెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్ బాస్ తెలుగు సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం అన్నపూర్ణ స్టూడియో దగ్గర రైతుబిడ్డ ఫ్యాన్స్ చేసిన రచ్చ, ఆర్టీసీ బస్బుల ధ్వంసం, కంటెంస్టెల కారులు పగలగొట్టిన పరిణామాల నేపథ్యంలో ప్రశాంత్‌పై మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ప్రశాంత్ A1గా, ఆయన తమ్ముడు A2గా ఉన్నారు. ఇప్పటికే తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రశాంత్ పరారీలో ఉన్నాడు. ఇప్పుడు ఎట్టకేలకు ప్రశాంత్‌ను తన ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బిగ్ బాస్ ఫినాలే అనంతరం ప్రశాంత్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఆ అల్లర్లలో ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు ప్రశాంత్‌పై కేసు నమోదుచేశారు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ అరెస్ట్ కోసం ప్రయత్నించగా.. అతను పరారీలో ఉన్నాడు. దీంతో ప్రశాంత్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఫోన్ స్వీఛ్ ఆఫ్ చేసి జంప్ అయిపోయిన రైతుబిడ్డ అని చెప్పుకునే సో కాల్డ్ పర్సన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు ఈ తతంగంలో బిగ్‌బాస్ హోస్ట్ సీనియర్ హీరో నాగార్జునను అరెస్ట్ చేయాలనే డిమాండ్లు జోరందుకున్నాయి. బిగ్‌బాస్ షో పేరుతో వ్యక్తులను అక్రమంగా 100రోజులుగా నిర్బంధించడంపై విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టులో న్యాయవాది అరుణ్ పిటిషన్ వేశారు. బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే షో ముగిసిన తర్వాత ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేయడానికి నాగార్జునను బాధ్యులు చేయాలని కోరారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వెనకున్న కుట్రను బయటకు తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వహించారని.. నాగార్జునను వెంటనే అరెస్ట్ చేయాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ డిమాండ్ చేశారు. దీంతో ఈ షోను హోస్ట్ చేస్తున్న నాగార్జున సైతం చిక్కుల్లో పడ్డారు. తాజాగా ప్రశాంత్ అరెస్ట్ కావడంతో బిగ్‌బాస్ నిర్వాహకులతో పాటు నాగార్జునను కూడా విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com