బ్రేకింగ్: మే-07 వరకు లాక్డౌన్ పొడిగింపు : కేసీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఆదివారం నాడు కేబినెట్ భేటీలో సుధీర్ఘంగా చర్చించిన అనంతరం తెలంగాణలో మే-07 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా మే-03 వరకు లాక్డౌన్ ఎత్తేస్తే తెలంగాణలో మాత్రం మే-07 వరకు కచ్చితంగా లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు తెలిపారు. పలు టీవీ చానెల్స్, వార్తా పత్రికలతో పాటు తాను కూడా స్వయంగా కొందరు ప్రముఖులతో మాట్లాడామని అన్నీ నిశితంగా మాట్లాడిన తర్వాతే పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. మే-05 తర్వాత మరోసారి కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏ ప్రాంతాల నుంచైనా సరే మే-07 వరకు తెలంగాణకు రావొద్దు.. ఇక్కడికొచ్చి ఇబ్బందులు పడొద్దని కేసీఆర్ తెలిపారు.
ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్స్ ఉండవ్..
రేపట్నుంచి బ్యాన్ స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ ఫుడ్స్ రేపట్నుంచి అనగా ఏప్రిల్-20 నడవవ్. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. ఇవాళ ఏమున్నా ఆర్డర్స్ చేసుకోవాలి.. రేపట్నుంచి మాత్రం నడవవ్’ అని కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు.
సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదు..
‘రాష్ట్ర ప్రజలు, ప్రజాప్రతినిధులు చాలా మంచిగా సహకరిస్తున్నారు. పండుగలు, ప్రార్ధనలు ఇకపై ఇంట్లోనే చేసుకోవాలి. ఇది అన్ని మతాలవారికి వర్తిస్తుంది. అన్ని సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కంటెన్మైంట్స్ ఏరియాల్లో ప్రజలు బయటికి రావొద్దు. దాతృత్వం ప్రదర్శిస్తున్న స్వచ్చంద సంస్థలకు ధన్యవాదాలు’ అని కేసీఆర్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments