బ్రేకింగ్: మే-07 వరకు లాక్‌డౌన్ పొడిగింపు : కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌ డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఆదివారం నాడు కేబినెట్ భేటీలో సుధీర్ఘంగా చర్చించిన అనంతరం తెలంగాణలో మే-07 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా మే-03 వరకు లాక్‌డౌన్ ఎత్తేస్తే తెలంగాణలో మాత్రం మే-07 వరకు కచ్చితంగా లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు తెలిపారు. పలు టీవీ చానెల్స్, వార్తా పత్రికలతో పాటు తాను కూడా స్వయంగా కొందరు ప్రముఖులతో మాట్లాడామని అన్నీ నిశితంగా మాట్లాడిన తర్వాతే పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. మే-05 తర్వాత మరోసారి కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏ ప్రాంతాల నుంచైనా సరే మే-07 వరకు తెలంగాణకు రావొద్దు.. ఇక్కడికొచ్చి ఇబ్బందులు పడొద్దని కేసీఆర్ తెలిపారు.

ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్స్ ఉండవ్..

రేపట్నుంచి బ్యాన్ స్విగ్గీ, జొమాటో ఆన్‌లైన్ ఫుడ్స్ రేపట్నుంచి అనగా ఏప్రిల్-20 నడవవ్. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. ఇవాళ ఏమున్నా ఆర్డర్స్ చేసుకోవాలి.. రేపట్నుంచి మాత్రం నడవవ్’ అని కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు.

సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదు..

‘రాష్ట్ర ప్రజలు, ప్రజాప్రతినిధులు చాలా మంచిగా సహకరిస్తున్నారు. పండుగలు, ప్రార్ధనలు ఇకపై ఇంట్లోనే చేసుకోవాలి. ఇది అన్ని మతాలవారికి వర్తిస్తుంది. అన్ని సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కంటెన్మైంట్స్ ఏరియాల్లో ప్రజలు బయటికి రావొద్దు. దాతృత్వం ప్రదర్శిస్తున్న స్వచ్చంద సంస్థలకు ధన్యవాదాలు’ అని కేసీఆర్ తెలిపారు.

More News

లాక్‌డౌన్ సడలింపుల్లేవ్.. మే-01 తర్వాత ఊరట : కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్-20 నుంచి లాక్ డౌన్‌ సడలింపులు ఉంటాయని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో మాత్రం అలాంటి సడలింపులు ఏమీ ఉండవని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పేశారు.

ఓటీటీలోకి గోవా బ్యూటీ..?

గోవా బ్యూటీ ఇలియానా ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ తీసుకునే హీరోయిన్‌గా క్రేజ్ ఉన్న స‌మ‌యంలోనే టాలీవుడ్‌ను వీడి బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.

రాజ‌మౌళికి ఛాలెంజ్ విసిరిన ద‌ర్శ‌కుడు..

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో దేశం యావ‌త్తు లాక్‌డౌన్‌లో ఉంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. కొత్త వారిని ఇంటికి ర‌ప్పించాలంటే అంద‌రూ ఆలోచ‌నలో ప‌డుతున్నారు.

హైదరాబాద్‌లో మరో పోలీస్‌కు కరోనా.. ఎలా వచ్చింది!?

రోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ విస్తరిస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో జనాలను బయటికి రానివ్వకుండా.. కరోనాపై పోరుల చేస్తున్న వైద్యులు, పోలీసులను సైతం ఈ మహమ్మారి కాటేస్తోంది.!

ఉద్యోగులను తొలగించొద్దు..: కంపెనీలకు కేటీఆర్ విజ్ఙప్తి

ఎట్టి పరిస్థితుల్లోనూ కంపెనీల్లోని ఉద్యోగులను తొలగించవద్దని పరిశ్రమ వర్గాలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పారిశ్రామిక వర్గాలకు ప్రత్యేకంగా కేటీఆర్ ప్రత్యేకంగా లేఖ