బ్రేకింగ్ : సీఎం కేజ్రీవాల్‌కు అస్వస్థత.. రేపు కరోనా టెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అస్వస్థతకు లోనయ్యారు. కరోనా లక్షణాలు అయిన జ్వరం, తలనొప్పి ఉండటంతో అప్రమత్తమైన సీఎం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన తన ఇంటిలోనే క్వారంటైన్లో ఉన్నారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని సీఎంవో నుంచి ప్రకటన వచ్చింది. కాగా.. ఆయన ఇంటికే పరిమితం కావడంతో అధికారిక కార్కక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. వాస్తవానికి చాలా కాలంగా ఆయన అస్తమాతో బాధపడుతూ మందులు వాడుతున్నారు.
ఇదిలా ఉంటే.. కేజ్రీవాల్ రేపు కరోనా టెస్ట్ చేయించుకోబోతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఆయన ఢిల్లీలోని కోవిడ్-19 ఆస్పత్రిలో టెస్ట్ చేయించుకోబుతున్నట్లు తెలియవచ్చింది. అయితే టెస్ట్ చేయించుకుంటే పరిస్థితి ఏంటి..? నెగిటివ్ వస్తుందో.. పాజిటివ్ వస్తుందో అని అభిమానులు, కార్యకర్తలు, నేతలు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ మహమ్మారి ఎవర్నీ వదలట్లేదు. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ, పొలిటికల్ లీడర్.. బీద, సాదా అనేది లేకుండా అందర్నీ వెంటాడుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments