బ్రేకింగ్: కరోనాతో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మృతి

  • IndiaGlitz, [Saturday,July 04 2020]

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. క్రమక్రమంగా అది అన్ని రంగాలకూ వ్యాపిస్తోంది. సినీ ఇండస్ట్రీకి కూడా కరోనా వ్యాపించింది. కొందరు సినీ ప్రముఖులు ఇప్పటికే కరోనాతో బాధ పడుతున్నారు. కాగా ఈరోజు ఉదయం ప్రముఖ నిర్మాత, పోకూరి బాబూరావు సోదరుడు పోకూరి రామారావు కరోనాతో మృతి చెందారు. నేటి ఉదయం 9 గంటలకు మణికొండలో ఆయన తుదిశ్వాస విడిచారు.

ఇటీవలే పోకూరి రామారావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో.. ఆయన కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేటి ఉదయం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈతరం ఫిలిమ్స్‌లో ఆయన ఎన్నో చిత్రాలను నిర్మించారు. మణికొండలో ఈరోజు ఉదయం 9 గంటలకు తుది శ్వాస విడిచారు.

More News

తెలంగాణలో మహిళా ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. వైద్యులతో పాటు ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు.

తెలంగాణలో విశ్వరూపం చూపించిన కరోనా.. నిన్న ఒక్కరోజే...

తెలంగాణలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. మొన్నటి వరకూ 1200 దాటని కరోనా కేసులు నిన్న దాదాపు 1900 కేసులు నమోదవడంతో తెలంగాణ ప్రజలు షాక్ అయ్యారు.

ఆ అందమైన ప్రేమకథకు హీరోగా రఘు కుంచె...

ఇప్పటికే ‘పలాస 1978’ చిత్రం ద్వారా ఓ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రఘు కుంచె హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది.

పవన్ ట్వీట్.. ఏపీకి ప్రశంస.. తెలంగాణకు చురక!

అధికార పక్షంలో ఉన్నామా? ప్రతిపక్షంలో ఉన్నామా? అనేది పక్కన బెడితే ప్రజా నాయకుడికి మంచిని మంచిగా ఒప్పుకున్నప్పుడే విలువ, గౌరవం ఉంటాయి.

ఎన్టీఆర్‌తో ఢీ కొట్ట‌డానికి మంచు హీరో ఒప్పుకుంటాడా?

కరోనా ప్రభావంతో ఏర్ప‌డ్డ లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్స్ బంద్ కావ‌డం.. షూటింగ్స్ ఆగిపోయాయి. రెండు నెల‌లు త‌ర్వాత షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి.