బ్రేకింగ్: అమిత్ షాకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు కరోనా బారిన పడగా.. తాజాగా కేంద్ర హోమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కొద్ది రోజులుగా తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నానని.. ఫలితం పాజిటివ్ అని వచ్చిందని ఆయన వెల్లడించారు. తాను ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని.. తనను సంప్రదించిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని అమిత్ షా అభ్యర్థించారు.

‘‘కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నాను. రిపోర్ట్ పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. వైద్యుల సలహా మేరకు నన్ను ఆసుపత్రిలో చేర్పించారు. గత కొద్ది రోజులుగా నన్ను సంప్రదించిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవడంతో పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని అభ్యర్థిస్తున్నాను’’ అని అమిత్‌షా ట్వీట్‌లో కోరారు.