బ్రేకింగ్: తెలంగాణలో ‘పది’ పరీక్షలు వాయిదా

  • IndiaGlitz, [Friday,March 20 2020]

తెలంగాణలో ఇటీవలే పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా అంతా కరోనా నేపథ్యంలో బంద్‌లో ఉన్నప్పటికీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. అయితే.. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొందరు తెలంగాణ హైకోర్టు మెట్లెక్కగా.. న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ కరోనా ప్రభావం పదో తరగతి పరీక్షలపై కూడా పడింది.

పరీక్షలు ఎప్పుడో..!

పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే.. రేపు అనగా శనివారం నాడు జరగాల్సిన పరీక్ష మాత్రం యథావిధిగా జరుగుతుందని కోర్టు తెలిపింది. మొన్న ప్రారంభమైన పది పరీక్షలు ఈ నెల 30 వరకు జరగాల్సి ఉంది. అయితే.. రేపు పరీక్ష జరిగిన అనంతరం తదుపరి పరీక్షలు వాయిదా పడనున్నాయి. అంటే.. సోమవారం నుంచి జరగాల్సిన పరీక్షలు ఇక జరగమన్న మాట. అయితే వాయిదా పడ్డ ఆ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయం మాత్రం తెలియరాలేదు.

29న తేలిపోనుంది!

కాగా.. ఈనెల 29న అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించిన తర్వాత తదుపరి పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి..? ఎలా నిర్వహించాలి..? అనే విషయంపై నిశితంగా చర్చించి ఉన్నతాధికారులు తదుపరి నిర్ణయం తీసుకొని హైకోర్టుకు తెలియజేయనున్నారు. ఈ విషయంలో హైకోర్టుదే తదుపరి నిర్ణయమని తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. అయితే ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది..? హైకోర్టు ఆదేశాలపై ఎలా ముందుకెళ్తుంది..? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

More News

బలపరీక్ష ఎదుర్కోకుండానే కమల్‌నాథ్ రాజీనామా

బలపరీక్షకు ముందే మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ సాయంత్రం 5గంటలకు బలపరీక్ష జరగనుంది. అయితే.. బలపరీక్ష ఎదుర్కోకుండానే కమల్‌నాథ్ రాజీనామా చేసేశారు.

యుద్ధాల కంటే ప్రమాదకరం.. 22న ఎవరూ బయటికి రావొద్దు!

మహమ్మారి కరోనా అంతకంతకూ వ్యాప్తి చెందుతుండడంతో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ దేశ ప్రజలను సున్నితంగా హెచ్చరించారు. జాతిని ఉద్దేచించి గురువారం నాడు మోదీ మాట్లాడారు.

దేశ చరిత్రలో ఫస్ట్ టైం..: ఎట్టకేలకు నిర్భయ నిందితులకు ఉరి

దేశ రాజధాని ఢిల్లీలో పెను సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు అయ్యింది. ఎన్నో ట్విస్ట్‌లు.. మరెన్నో వాయిదాలు.. ఇంకెన్నీ పిటిషన్ల మధ్య ఎట్టకేలకు శుక్రవారం తెల్లారుజామున

శ్రీవారి భక్తులారా సహకరించండి : టీటీడీ ఈవో

‘కరోనా’ మహమ్మారి కాటేస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీసుకున్న నిర్ణయాలకు భక్తులు సహకరించాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. గురువారం నాడు సాయంత్రం విలేకరుల సమావేశంలో

జెన్నిఫర్.. మీ త్యాగానికి ప్రపంచం హ్యాట్సాఫ్!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో.. ఆ పేరెత్తితేనే వణికిపోతున్న క్రమంలో..  మందులు లేకుండా శవాలు గుట్టల్లా తేలుతున్న సందర్భంలో.. నాపైన టెస్ట్‌లు చేసి మందు కనిపెట్టండి..