బ్రేకింగ్: తెలంగాణలో ‘పది’ పరీక్షలు వాయిదా
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ఇటీవలే పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా అంతా కరోనా నేపథ్యంలో బంద్‌లో ఉన్నప్పటికీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. అయితే.. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొందరు తెలంగాణ హైకోర్టు మెట్లెక్కగా.. న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ కరోనా ప్రభావం పదో తరగతి పరీక్షలపై కూడా పడింది.
పరీక్షలు ఎప్పుడో..!
పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే.. రేపు అనగా శనివారం నాడు జరగాల్సిన పరీక్ష మాత్రం యథావిధిగా జరుగుతుందని కోర్టు తెలిపింది. మొన్న ప్రారంభమైన పది పరీక్షలు ఈ నెల 30 వరకు జరగాల్సి ఉంది. అయితే.. రేపు పరీక్ష జరిగిన అనంతరం తదుపరి పరీక్షలు వాయిదా పడనున్నాయి. అంటే.. సోమవారం నుంచి జరగాల్సిన పరీక్షలు ఇక జరగమన్న మాట. అయితే వాయిదా పడ్డ ఆ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయం మాత్రం తెలియరాలేదు.
29న తేలిపోనుంది!
కాగా.. ఈనెల 29న అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించిన తర్వాత తదుపరి పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి..? ఎలా నిర్వహించాలి..? అనే విషయంపై నిశితంగా చర్చించి ఉన్నతాధికారులు తదుపరి నిర్ణయం తీసుకొని హైకోర్టుకు తెలియజేయనున్నారు. ఈ విషయంలో హైకోర్టుదే తదుపరి నిర్ణయమని తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. అయితే ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది..? హైకోర్టు ఆదేశాలపై ఎలా ముందుకెళ్తుంది..? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com