పవన్ ను కొత్తగా చూపిస్తున్న త్రివిక్రమ్
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే క్రేజీ అనొచ్చు. ఎందుకనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు సూపర్ హిట్ కావడమే. ఇప్పుడు ఇద్దరు ముచ్చటగా మూడోసారి కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ మరోసారి పవన్‌కళ్యాణ్‌ను కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నాడు.
ఈ సినిమాలో పవన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్రలో కనపడనున్నాడట. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాకు `ఇంజనీరింగ్ బాబు` అనే టైటిల్‌ను పెడతారని న్యూస్ వినపడుతుంది. దీనికి ఇంటి పేరు వంటి పేరు అదే ..అనేది క్యాప్పన్. టైటిల్ వింటూనే త్రివిక్రమ్ తన మార్కు కామెడితో పవన్ రోల్‌ను డిజైన్ చేసినట్టు కనపడుతుంది. ఈ సినిమాలో కీర్తిసురేష్, అనుఇమ్మాన్యుయల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com