ఇబ్బందుల్లో 'బ్రాండ్ బాబు'
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి విడుదలైన చిత్రాల్లో బ్రాండ్ బాబు ఒకటి. ఈ టీవీ ప్రభాకర్ ఈ సినిమాకు దర్శకుడే అయినా.. సినిమాకు సంబంధించిన కథ, మాటలు, స్క్రీన్ప్లే అంతా మారుతిదే. ప్రముఖ కన్నడ నిర్మాత తనయుడు సుమంత్ సుమంత్ శైలేంద్ర ఈ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో ఉపయోగించిన ఓ ఫోటో ఇప్పుడు సినిమాకు సమస్యను తెచ్చిపెట్టింది. అదేంటంటే.. సినిమాలో హీరోయిన్ తల్లి పాత్రలో ఓ మహిళా జర్నలిస్ట్ ఫోటోను ఉపయోగించారు.
అది కూడా ఆమె చనిపోయినట్లు సినిమాలో చూపించారు. అయితే ఆ ఫోటోను అలా చూపిస్తామని కానీ..సినిమాలో ఉపయోగించుకుంటామని కానీ చిత్ర యూనిట్ సదరు జర్నలిస్టును సంప్రదించలేదు. దాంతో ఆ మహిళా జర్నలిస్ట్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషల్లో కేసు పెట్టారు. మరిప్పుడు మారుతి అండ్ టీం దీనిపై ఎలా స్పందిస్తారో చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com