కలిసి ఉంటే కలదు సుఖం అని చెబుతున్న 'బ్రహ్మోత్సవం' - కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు

  • IndiaGlitz, [Monday,May 23 2016]

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా, కాజల్‌, సమంత, ప్రణీత హీరోయిన్స్‌గా పి.వి.పి. సినిమా-ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్స్‌పై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె నిర్మించిన యూత్‌ఫుల్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం మే 20న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అయి భారీ ఓపెనింగ్స్‌ ని సాధించి, సూపర్‌హిట్‌ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ పెర్‌ఫార్మెన్స్‌, కాజల్‌, సమంత గ్లామర్‌ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌ కాగా, రత్నవేలు ఫొటోగ్రఫీ, తోట తరణి సెట్స్‌, మిక్కీ జె. మేయర్‌ సంగీతం, గోపీ సుందర్‌ రీ-రికార్డింగ్‌, పివిపి ప్రొడక్షన్‌ వేల్యూస్‌ సినిమా ప్రధానాంశాలుగా నిలిచాయి. కాగా ఈ చిత్రంపై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ మంచి రెస్పాన్స్‌ ను రాబట్టుకుంటోంది. కాగా సినీమ్యాక్స్ లో ఈ చిత్రాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం....

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ 'సినిమాలో కలిసి ఉండాలి. అందరూ కలిసి ఉంటే కలదు సుఖం అనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించారు. మంచి సందేశాన్నిచ్చారు. ఇప్పుడు అందరూ చాలా బిజీగా, వేగవంతమైన జీవితాలను గడుపుతున్నారు. కానీ అందరూ కలిసి ఉండాలనే ఉత్తమమైన, ఉదాత్తమైన ఆలోచనను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చక్కగా తెరకెక్కించారుమహేష్ సినిమాలో ఏదో నటిస్తున్నట్లు కాకుండా మనం సాధారణంగా ఎలా ఉంటామో అలా కనిపిస్తూనే మంచి నటనను ప్రదర్శించారు. . పివిపిగారు సినిమాను చాలా రిచ్ గా, ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా ఉండేలా నిర్మించారు. అందరూ కలిసి చూసే మంచి కుటుంబ కథా చిత్రం'' అన్నారు.

More News

నాని రిలీజ్ డేట్ మారింది....

నాని హీరోగా శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం జెంటిల్ మన్.

మహేష్ కు వర్మ సలహాలు...

సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం విడుదలై అనుకున్న స్థాయిలో టాక్ తెచ్చుకోలేదు.

ఈ రికార్డ్ కూడా రజనీకే సొంతం..

రజీనీకాంత్ నటించిన చిత్రం కబాలి.జూలై 1న విడుదలవుతుంది.

రానా చేతుల మీదుగా జెంటిల్ మన్ ఆడియో విడుదల

నాని హీరోగా నటించిన తాజా చిత్రం జెంటిల్ మన్.ఈ చిత్రానికి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు.

సైతాన్ గా విజయ్ అంటోని ఎలా ఉంటాడంటే...

మ్యూజిక్ డైరెక్టర్ నుండి హీరో,నిర్మాతగా మారిన విజయ్ ఆంటోని రీసెంట్ గా తెలుగులో విడుదలైన బిచ్చగాడు చిత్రంతో పెద్ద సక్సెస్ ను సాధించాడు.