బ్రహ్మోత్సవం సాంగ్ మేకింగ్ రిలీజ్...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నభారీ చిత్రం బ్రహ్మోత్సవం. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, తమిళ్ లో నిర్మిస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన బ్రహ్మోత్సవం ఆడియోను ఈనెల 7న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని వచ్చింది కదా అవకాశం..సాంగ్ మేకింగ్ రిలీజ్ చేసారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను రాజు సుందరం నృత్య దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నారు.
ఈ పాట గురించి గీత రచయిత సీతారామ శాస్త్రి మాట్లాడుతూ...నాకు మిక్కీ జే మేయర్ సంగీతం అంటే చాలా ఇష్టం. ఈ పాటకు అద్భుతమైన సంగీతం అందించాడు. ఈ పాట గురించి చెప్పాలంటే... అనేక ఇబ్బందులతో ఉన్న మనుషులు ఒక చోట చేరినప్పుడు ..అందరం వచ్చాం కదా..పండగ వచ్చింది కదా...ఇబ్బందులు దాటుకుని వచ్చింది కదా అవకాశం... ఓ మంచి మాట అనుకుందాం..అంటూ ఈ పాట ఉంటుంది. సంగీత్ లో పాట పాడుకోవాలంటే సంగీతమే రావలసిన అవసరం లేదు. ఆనందంలో ఉన్నప్పుడు ఎవరైనా పాడుకోవచ్చు అనే ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటుంది అన్నారు.
సంగీత్ అంటే డిస్కో తరహా పాట చేస్తారు..కానీ డిఫరెంట్ గా ఉండేలా ఈ సాంగ్ చేసాం. మిక్కీ అదిరిపోయే సంగీతం అందించాడు. తోట తరణి అద్భుతమైన సెట్ ను రూపొందించారు అని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తెలియచేసారు. సీనియర్ నటి జయసుథ ఈ పాట గురించి స్పందిస్తూ.. అద్భుతమైన పాట ఇది. ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ వయసులో కూడా మాకు డ్యాన్స్ చేయాలి అనిపించింది అంటే సాంగ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈసినిమా రిలీజ్ తర్వాత ఎక్కడ సంగీత్ జరిగినా ఈ పాట వేసి డ్యాన్స్ చేస్తారనేది 100% ఖాయం అన్నారు. బ్రహ్మోత్సవం చిత్రాన్ని ఈనెల 20న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments