భారీ అంచనాలను పెంచిన బ్రహ్మోత్సవం టీజర్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బ్రహ్మోత్సవం. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో పి.వి.పి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. మహేష్ సరసన కాజల్, సమంత, ప్రణీత నటిస్తున్నారు. నూతన సంవత్సర కానుకగా ఈరోజు ఉదయం 9.36 నిమిషాలకు బ్రహ్మోత్సవం ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసారు. ఫ్యామిలీ అంతా కలసి ఉన్న పెళ్లి పాటలో...మహేష్ మరింత అందంగా కనిపిస్తున్నాడు.
మహేష్ తో పాటు ఈ సినిమాలోని ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఇతర నటీనటులు ఈ టీజర్ లో కనిపించారు. ఈ టీజర్ బ్రహ్మాత్సవం పై అనుకున్న దానికంటే ఎక్కువుగా భారీ అంచనాలు పెంచేస్తోంది. శ్రీమంతుడు బ్లాక్ బష్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడం, అలాగే గతంలో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కాంబినేషన్ మహేష్, శ్రీకాంత్ అడ్డాల కలసి చేస్తున్న సినిమా కావడంతో బ్రహ్మోత్సవం పై మరింత క్రేజ్ ఏర్పడింది. పి.వి.పి సంస్థ తో కలసి మహేష్ నిర్మిస్తున్న బ్రహ్మోత్సవం చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com