బ్ర‌హ్మోత్స‌వం కొత్త టీజ‌ర్ వ‌చ్చేస్తుంది

  • IndiaGlitz, [Thursday,March 24 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణీత న‌టిస్తున్నారు. సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమా త‌ర్వాత మ‌హేష్ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

నూత‌న సంవ‌త్సర కానుక‌గా రిలీజ్ చేసిన టీజ‌ర్ కి మంచి స్పంద‌న ల‌భించింది. తాజాగా తెలుగు వారి కొత్త సంవ‌త్స‌రాది ఉగాది కానుక‌గా మ‌రో టీజ‌ర్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తుంది బ్ర‌హ్మోత్స‌వం టీమ్. ఈసారి టీజ‌ర్ ఎలా ఉంటుంద‌నే ఆసక్తి పెరిగింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోనుంది. ఈ భారీ చిత్రాన్ని మే నెల‌లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

బాల‌య్య వందో సినిమా ఫిక్స్..

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ వందో సినిమా గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. కృష్ణ‌వంశీ - క్రిష్ ఈ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు బాల‌య్య వందో సినిమా డైరెక్ట‌ర్ అని ప్ర‌చారం జ‌రిగింది.

స‌ర్ధార్ మెగా హీరోల‌కు న‌చ్చ‌లేదా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ సెన్సేష‌న్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో రిలీజైంది. స‌ర్ధార్ ట్రైల‌ర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ ట్రైల‌ర్ కి మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తోంది.

త‌మ‌న్నా కోరిక నెర‌వేరిన‌ట్టే

పేరుకి ఉత్తరాది భామ అయినా.. ద‌క్షిణాది భాష‌లు తెలుగు, త‌మిళంను సైతం అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల నైపుణ్యం హీరోయిన్ త‌మ‌న్నా సొంతం. అయితే అంత బాగా మాట్లాడుతున్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రెండు భాష‌ల్లోనూ డ‌బ్బింగ్ చెప్పుకోలేక‌పోయింది త‌మ‌న్నా. అయితే ఆ లోటు ఈ సంవ‌త్స‌రం తీర‌బోతున్న‌ట్లే. 

నాలుగోసారి ఆమెకి ఛాన్స్ ఇచ్చిన‌ విక్ర‌మ్‌

'మ‌నం' చిత్రంతో తెలుగువారికి బాగా ద‌గ్గ‌రైన ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్‌.. ప్ర‌స్తుతం సూర్య‌తో '24' అనే సైంటిఫిక్ ఫిక్ష‌న్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా విక్ర‌మ్‌కి ద‌ర్శ‌కుడిగా ఆర‌వ చిత్రం. ఈ సినిమా కోసం ఓ అంశాన్ని విక్ర‌మ్ నాలుగోసారి రిపీట్ చేస్తున్నాడు.

'అ..ఆ..'తో  బ్రేక్ ప‌డుతుందా?

'ఇష్క్‌', 'గుండె జారి గ‌ల్లంత‌య్యిందే' చిత్రాల‌తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు నితిన్‌. అయితే.. ఆ త‌రువాత న‌టించిన సినిమాలే నితిన్‌కి ఏ మాత్రం అచ్చి రాలేదు. ఈ నేప‌థ్యంలో త‌న కొత్త చిత్రం 'అ..ఆ.'.పై బోలెడు ఆశ‌ల‌ను పెట్టుకున్నాడు ఈ యువ క‌థానాయ‌కుడు.