తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన రోజున రామోజీ ఫిల్మ్ సిటీలో 'బహ్మోత్సవం' షూటింగ్ ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా పి.వి.పి. సినిమా పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ 16న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్ మాట్లాడుతూ - ''శ్రీకాంత్ అడ్డాలతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత చేస్తున్న సినిమా ఇది. శ్రీకాంత్ చెప్పిన లైన్ ఎక్స్ట్రార్డినరీగా వుంది, సబ్జెక్ట్ ఎక్స్ట్రార్డినరీగా వుంది. శ్రీమంతుడు వంటి మంచి సినిమా తర్వాత మరో అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నందుకు హ్యాపీగా వుంది. ఇది అన్నివర్గాల ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకునే ఒక మంచి కుటుంబ కథా చిత్రం అవుతుంది'' అన్నారు.
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ - ''తిరుపతిలో వెంకటేశ్వరస్వామి బ్రహ్మూెత్సవాలు ప్రారంభమైన రోజునే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'బ్రహ్మూెత్సవం' చిత్రం షూటింగ్ ప్రారంభించాము. సూపర్‌స్టార్ మహేష్‌తోపాటు 21 మంది ఆర్టిస్టులతో ఒక సెలబ్రేషన్లాంటి సంగీత్ సాంగ్‌తో పెద్ద ఎత్తున షూటింగ్ ప్రారంభించాం. ఈ సెలబ్రేషన్స్ కంటిన్యూగా జరుగుతూనే వుంటాయి'' అన్నారు.
నిర్మాత ప్రసాద్ వి. పొట్టూరి మాట్లాడుతూ - ''బ్రహ్మూెత్సవాలు ప్రారంభమైన రోజునే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో రామోజీ ఫిలిం సిటీలో మా 'బ్రహ్మూెత్సవం' షూటింగ్ ప్రారంభించడంతో మాకు వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందినట్టుగా భావిస్తున్నాం. 513 మంది క్రూతో తోట తరణిగారు వేసిన భారీ సెట్లో ఈ సాంగ్‌ని చాలా లావిష్‌గా తీస్తున్నాం. ఇంతమంది ఆర్టిస్టుల కాంబినేషన్లో రోజూ ఓ ఉత్సవంలా బ్రహ్మూెత్సవం షూటింగ్ జరుగుతుందిమా బేనర్‌కి ఇది ఒక ప్రతిష్ఠాత్మక చిత్రమవుతుంది. మహేష్‌బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతుంది. సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
సూపర్‌స్టార్ మహేష్ సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జయసుధ, రేవతి, నరేష్, రావు రమేష్, తనికెళ్ళ భరణి, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణభగవాన్, రజిత, కాదంబరి కిరణ్, చాందిని చౌదరి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఆర్.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె. మేయర్, డాన్స్: రాజుసుందరం, ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ గుణ్ణం, నిర్మాతలు: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments