ఊటీలో బ్రహ్మోత్సవం
Send us your feedback to audioarticles@vaarta.com
మహేష్ హీరోగా పి.వి.పి. సినిమా పతాకంపై రూపొందుతున్న చిత్రం బ్రహ్మోత్సవం. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. పెరల్.వి.పొట్లూరి, పరమ్.వి.పొట్లూరి నిర్మాతలు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. దర్శకుడు మాట్లాడుతూ ``ఇప్పటిదాకా రెండు షెడ్యూళ్ళు చేశాం. ఈ నెల 28 నుంచి మూడో షెడ్యూల్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలుపెడుతున్నాం. డిసెంబర్ 9 వరకు హైదరాబాద్‌లో షూట్ చేసి ఊటీకి షిప్ట్ అయి డిసెంబర్ 10 నుంచి నెలాఖరు వరకు అక్కడ చేస్తాం. ఊటీలో చిత్రంలోని నటీనటులందరూ పాల్గొనే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం`` అని అన్నారు.
ప్రసాద్.వి.పొట్లూరి మాట్లాడుతూ ``ఒక అద్భుతమైన కథతో, అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సూపర్‌స్టార్ మహేష్ కెరీర్ కి, మా బేనర్‌కి ఇది ఒక ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది`` అని అన్నారు. సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత నాయికలు. ఈ చిత్రంలో సత్యరాజ్, జయసుధ, రేవతి, నరేష్, రావు రమేష్, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, తులసి, ఈశ్వరీరావు, సాయాజీ షిండే, కృష్ణభగవాన్, రజిత, కాదంబరి కిరణ్, చాందిని చౌదరి ఇతర పాత్రధారులు. కెమెరా: ఆర్.రత్నవేలు, సంగీతం: మిక్కీ.జె.మేయర్, డాన్స్: రఆజు సుందరం, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com