బ్రహ్మోత్సవం రన్ టైమ్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం బ్రహ్మోత్సవం. బంధాలు - అనుబంధాల ప్రాముఖ్యతను నేటి తరానికి తెలియచేసే విభిన్న కథాంశంతో బ్రహ్మోత్సవం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తెలుగు, తమిళ్ లో ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మించింది. ఫ్యామిలీ అంతా కలసి చూసేలా తెరకెక్కించిన బ్రహ్మోత్సవం చిత్రం రన్ టైమ్ 156 నిమిషాలు అంటే 2 గంటల 36 నిమిషాలు.
ఓవర్ సీస్స్ లో భారీ స్ధాయిలో ప్రీమియర్ షోస్ వేస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మోత్సవం రిలీజ్ రోజు 5 ఆటలు ప్రదర్శిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఈ నెల 20న గ్రాండ్ గా రికార్డ్ స్ధాయిలో రిలీజ్ చేస్తున్నారు. దీనిని బట్టి బ్రహ్మోత్సవం మొదటి మూడు రోజుల్లోనే భారీ కలెక్షన్స్ వసూలు చేయడం ఖాయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments