బ్రహ్మోత్సవం విడుదల తేదీ...

  • IndiaGlitz, [Friday,February 26 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - శ్రీకాంత్ అడ్డాల సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు త‌ర్వాత క‌ల‌సి చేస్తున్న సినిమా బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్ లో పి.వి.పి సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణీత న‌టిస్తున్నారు. బ్ర‌హ్మోత్స‌వం గురించి రోజుకో వార్త బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డంతో సినిమా పై మ‌రింత క్రేజ్ పెరుగుతుంది.
మ‌హేష్ కుమార్తె సితార ఈ సినిమాలో న‌టిస్తుండ‌డం ప్ర‌త్యేకార్ష‌ణ‌. ఈ మూవీని ఏప్రిల్ లో రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. మే నెల‌లో కృష్ణ గారి పుట్టిన‌రోజైన మే 31న బ్ర‌హ్మోత్సవం రిలీజ్ చేస్తార‌నే వార్త ప్ర‌చారంలోకి వ‌చ్చింది. కానీ లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే...మే 6న బ్ర‌హ్మోత్స‌వం సినిమాని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ డేట్ ను అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

More News

నాగ్ ఊపిరి ఆడియో డేట్..

టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ హీరో కార్తీ - మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందిన క్రేజీ మూవీ ఊపిరి. వంశీ పైడిప‌ల్లి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. తెలుగు, త‌మిళ్ లో ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది.

శృతి మించిన శృతిహాస‌న్..

అందం - అభిన‌యంతో ఆక‌ట్టుకున్న అందాల క‌థానాయిక శృతిహాస‌న్. తెలుగు,తమిళ‌, హిందీ చిత్రాల్లో న‌టిస్తూ..త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకుంది.

నిన్న వ‌ర్మ‌, విష్ణు నేడు సాయి కొర్ర‌పాటి...

ఈగ‌, అందాల రాక్ష‌సి, లెజెండ్, ఊహ‌లు గుస‌గుసలాడే, దిక్కులు చూడ‌కురామయ్య‌...ఇలా విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించి అన‌తి కాలంలోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్ననిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న‌చిత్రం.

'ధనాధన్' పాటలు విడుదల

వైభవ్,రమ్యా నంబీసన్ జంటగా తమిళంలో రూపొందిన 'డమాల్ డుమీల్'చిత్రాన్ని బ్లాక్ బస్టర్ మూవీ మేకర్స్ పతాకంపై 'ధనాధన్'

కోర్టులో శ్రీమంతుడు

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన శ్రీమంతుడు సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.