బ్రహ్మోత్సవం రిలీజ్ డే ప్లానింగ్ సూపర్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం బ్రహ్మోత్సవం. మహేష్ సరసన కాజల్, సమంత, ప్రణీత నటించారు. తెలుగు, తమిళ్ లో రూపొందిన బ్రహ్మోత్సవం ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో్ ఎంత పెద్ద సినిమా అయినా మూడు రోజుల్లోనే భారీ కలెక్షన్స్ సాధించేలా ప్లాన్స్ చేస్తున్నారు. బ్రహ్మోత్సవం సినిమా కూడా మొదటి మూడు రోజుల్లోనే భారీ కలెక్షన్స్ సాధించేలా పక్కా ప్లాన్ రెడీ చేసారు.
ఇంతకీ బ్రహ్మోత్సవం రిలీజ్ డే ప్లాన్ ఏమిటంటే...తెలంగాణ రాష్ట్రంలోని అన్ని థియేటర్స్ లో బ్రహ్మోత్సవం రిలీజ్ రోజున 5 ఆటలు ప్రదర్శించేలా ప్లాన్ చేసారు.థియేటర్స్ లో ఉదయం 8.10 నిమిషాల నుంచి బ్రహ్మోత్సవం షో స్టార్ట్ అవుతుంది. దీంతో బ్రహ్మోత్సవం రిలీజ్ రోజునే రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ సాధించడం ఖాయం. బ్రహ్మోత్సం ప్లానింగ్ అదిరింది..మరి ఫుల్ రన్ లో బ్రహ్మోత్సం ఎంత కలెక్ట్ చేస్తుందో..? ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments