బ్రహ్మోత్సవం రిలీజ్ డేట్ మారింది.
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న న్యూమూవీ బ్రహ్మోత్సవం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ్ లో ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. మహేష్ సరసన కాజల్, సమంత, ప్రణీత నటిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ చిత్రాన్నిఏప్రిల్ 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కబాలి చిత్రాన్ని ఏప్రిల్ 10న తెలుగు, తమిళ్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అందుచేత మహేష్ బ్రహ్మోత్సవం మూవీని ముందు అనుకున్నట్టుగా ఏప్రిల్ 8న కాకుండా ఏప్రిల్ 29న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. అందులోను మహేష్ తొలిసారి తెలుగు, తమిళ్ లో ఒకేసారి బ్రహ్మోత్సవం రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. ఏప్రిల్ 8 రిలీజ్ అనుకున్న బ్రహ్మోత్సవం రిలీజ్ డేట్ ఏప్రిల్ 29కి మారితే...పవర్ స్టార్ సర్ధార్, స్టైలీష్ స్టార్ సరైనోడు రిలీజ్ డేట్స్ మారడం ఖాయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com