బ్రహ్మోత్సవం న్యూ పబ్లిసిటీ...
- IndiaGlitz, [Monday,May 30 2016]
సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం విడుదలైన రోజు నుండే ప్లాప్ టాక్ మూటగట్టుకుంది. వెంటనే తేరుకున్న యూనిట్ సభ్యులు సినిమా వ్యవధిని 18 నిమిషాలు పాటు తగ్గించారు. ఇలా చేసిన తర్వాత కూడా పెద్దగా కలెక్షన్స్ పెరగలేదు. అయినా అభిమానులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కొత్త రకంగా పబ్లిసిటీని స్టార్ట్ చేశారట. బోరింగ్ సీన్స్ అన్నీ తొలిగించాం. ఇప్పుడు అందరూ చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటూ పోస్టర్స్ మీదనే ప్రింట్ చేయడం గమనార్హం. ఇలా చేయడం వెనుక సినిమాను పోయిందని అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకుంటున్నారా? అని తెలియడం లేదు కానీ ఈ కొత్తరకం పబ్లిసిటీ వల్ల ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారంటారా? ఏమో వారికే తెలియాలి మరి...