'బ్రహ్మోత్సవం' కి డబుల్ ప్లస్
Send us your feedback to audioarticles@vaarta.com
ఫ్రేమ్‌నిండా ఆర్టిస్ట్‌లతో కలర్‌ఫుల్ గా తెరకెక్కిన స్టార్ హీరో చిత్రం 'బ్రహ్మోత్సవం'. మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ప్రిన్స్ కి కలిసొచ్చిన కాజల్, సమంత ఇందులో హీరోయిన్లుగా నటించారు. కాజల్ విషయం తీసుకున్నా, సమంత విషయం తీసుకున్నా ఓ సంగతి క్లియర్‌గా తెలుస్తుంది. అదేమిటంటే.. కుటుంబ కథా చిత్రాలతో ఇద్దరికీ మంచి ట్రాక్ రికార్డే ఉంది.
కాజల్ సంగతి తీసుకుంటే.. 'చందమామ', 'బృందావనం', 'డార్లింగ్', 'మిస్టర్ పర్‌ఫెక్ట్', 'గోవిందుడు అందరివాడేలే' చిత్రాలు ఆ తరహాలో ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటీ నెగెటివ్ రిజల్ట్ ఇవ్వలేదు. ఇక సమంత సంగతి తీసుకుంటే.. 'బృందావనం', 'దూకుడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'అత్తారింటికి దారేది', 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి పాజిటివ్ రిజల్ట్ చిత్రాలు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌లతో రూపొందినవే.
మరి.. ఫ్యామిలీ సబ్జెక్ట్‌లతో అలరించిన ఈ ఇద్దరు నాయికలు 'బృందావనం' తరువాత కలిసి నటిస్తున్న వైనం.. డబుల్ ప్లస్ గా మారి ఆ జోనర్ పరంగా మరో హిట్‌కి దారి తీస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments