'బ్రహ్మోత్సవం'తో మారుతుందా?
- IndiaGlitz, [Tuesday,October 20 2015]
తెలుగు దర్శకులకు ద్వితీయ విఘ్నం అనే సమస్య గత కొన్నాళ్లుగా వెంటాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమస్యను అధిగమించిన అతి కొద్దిమంది దర్శకులలో త్రివిక్రమ్, శ్రీకాంత్ అడ్డాల, కొరటాల శివ లను చేర్చుకోవచ్చు. ఈ ముగ్గురు కూడా మహేష్‌తోనే తమ రెండో సినిమాలను చేసి భారీ విజయం మూటగట్టుకున్నారు.
వీరిలో త్రివిక్రమ్ మళ్లీ మహేష్‌తో 'ఖలేజా' సినిమా చేశాడు. సంఖ్యా పరంగా త్రివిక్రమ్‌కది నాలుగో సినిమా. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. కట్ చేస్తే.. శ్రీకాంత్ అడ్డాల కూడా తన 4వ సినిమాని మహేష్‌తో 'బ్రహ్మోత్సవం'గా చేస్తున్నాడు. త్రివిక్రమ్ తన 4 సినిమాని మహేష్‌తో చేస్తే విజయం దక్కలేదు. మరి 'బ్రహ్మోత్సవం' తో శ్రీకాంత్ విషయంలోనైనా ఆ పరిస్థితి మారుతుందా? వేచి చూద్దాం.